Thursday, November 14, 2024

రైతుల తలరాత మార్చే ప్రాజెక్టు మల్లన్నసాగర్: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

రైతు తలరాత మార్చే తరతరాలు ఉండే ప్రాజెక్టు

అనతి కాలంలో గొప్పపని మన కళ్ల ముందు జరిగింది

మల్లన్నసాగర్ ను సందర్శించిన రాష్ట్ర మంత్రి హరీశ్

Farmers happy with Mallanna sagar project

సిద్దిపేట: రైతుల తలరాత మార్చే తరతరాలు ఉండే గొప్ప ప్రాజెక్టు మల్లన్న సాగర్ అని, అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్ల ముందు జరిగిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి హరీష్ రావు శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిఎం కెసిఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారమైందన్నారు. ఈ మేరకు ఎన్ని టిఎంసిల నీళ్లు వచ్చాయని, ఎన్ని మీటర్ల ఎత్తు వరకూ వచ్చాయో.. ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆరా తీశారు. 11 టిఎంసిల మేర నీళ్లు వచ్చాయని, 30 మీటర్ల ఎత్తు వరకూ పైకి నీళ్లు వచ్చాయని, బండ్ మొత్తం 22 కిలో మీటర్లు ఉండగా., దాదాపు 20 కిలో మీటర్ల మేర నీళ్లు చేరినట్లు ఇరిగేషన్ డిఇ సుమన్, జెఇ భరత్ లు మంత్రికి వివరించారు. ఈ విషయమై అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులతో ఎప్పటికీ నిలిచిపోయే గొప్పపని అని, అనతి కాలంలోనే పూర్తి చేసుకున్నామని గత అనుభవాలను గుర్తు చేశారు. మంత్రి వెంట ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బక్కి వెంకటయ్య, తొగుట స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News