- Advertisement -
హైదరాబాద్: రైతులు మార్కెట్‌లో అత్యుత్తమ ధరలు పొందడంలో అధికారులు సహాయపడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. అవసరమైతే నిల్వలు అందించడంలో సహాయం చేయాలని సూచించారు. సచివాలయంలో వ్యవసాయ, సహకార, చేనేత శాఖల పరిధిలోని సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, ఎండిలతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమావేశమయ్యారు. ముఖ్యంగా ఖమ్మం మార్కెట్ ఆధునీకరణపై విస్త్రృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు. రైతులకు నమ్మకమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని, ఉత్తమ విత్తన సంస్థలను ఎంపిక చేసి గుర్తించాలన్నారు. వ్యవసాయ, సహకార, చేనేత శాఖల సంస్థల పనితీరుపై దిశానిర్దేశం చేశారు. విత్తనాల లభ్యత, ధృవీకరణపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రఘునందన్ రావు, శైలజ రమయ్యార్, అధికారులు, తదితరలు పాల్గొన్నారు.
- Advertisement -