Saturday, November 16, 2024

పంజాబ్‌లో రైతుల రైల్‌ రోకో..

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: రోడ్డు ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి తీసుకన్న భూమికి మెరుగైన పరిహారంతోపాటు అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ పంజాబ్‌లో రైతులు పోరుబాట పట్టారు. గురుదాస్‌పూర్ జిల్లా బటాలాలో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కెఎంజెసి) ఆధ్వర్యంలో రైతులు రైల్‌రోకో చేపట్టారు. రైలు పట్టాలపై కూర్చుని రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. తమ నుంచి సేకరించిన భూములకు సరైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని కెఎంఎస్సి కార్యదర్శి సర్వన్‌సింగ్ పంధేర్ పేర్కొన్నారు.

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్నదని, బాధిత రైతులందరికీ ఎకరాకు రూ. 50 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. వ్యవసాయ రుణాలపై ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయాలని, రైతులకు ఊరట ఇచ్చేలా ఆరు నెలల పాటు వాయిదాల చెల్లింపుపై మారటోరియం విధించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News