Saturday, November 23, 2024

26న భారత్ బంద్‌..

- Advertisement -
- Advertisement -

Farmers Leaders Call Bharat Bandh on March 26

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ చట్టాల రద్దు చేయాలంటూ ఈ నెల 26న అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటి (ఎఐకెసిసి) చేపట్టిన భారత్ బంద్‌లో ప్రజలు భాగస్వామ్యం కావాలని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ కోరారు. అన్నదాతలకు ప్రతీ ఒక్కరూ మద్దతుగా నిలవాలని రైతు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ ఆధ్వరర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేట్లకు లబ్ది చేకూర్చేలా ఉన్న చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ విస్సా కిరణ్‌కుమార్ డిమాండ్ చేశారు. నాలుగు నెలలుగా ఉద్యమం సాగుతున్నప్పటికీ కేంద్రం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు. రైతుల ప్రయోజనాల దృష్టా మద్దతు ధర గ్యారంటీ చట్టం తేవాలని కోరారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను ఉరితీసిన రోజైన ఈ నెల 23న వారి త్యాగాలు స్మరించుకుంటూ కాగడాలు, కొవ్వొత్తులు, ప్రదర్శనలు చేపట్టాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష రైతు సంఘాల నేతలు, పద్మ, వేములపల్లి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Farmers Leaders Call Bharat Bandh on March 26

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News