Thursday, January 23, 2025

రైతుల రుణాలను మాఫీ చేయాలి

- Advertisement -
- Advertisement -

గార్ల: రైతుల పంట రుణాలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు, వైస్ ఎంపీపీ కట్టెబోయిన శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకు ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నాలో శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ.. రూ. లక్ష పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ నేటి వరకు నెరవేరలేదన్నారు.

తక్షణమే పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాలన్నారు. రైతులు సాగుకు సిద్ధమవుతున్నారని వ్యవసాయ అవసరాల కోసం కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండలాధ్యక్షుడు జంపాల వెంకన్న, రాగం రమేశ్, దారవత్ వీరన్న, సింగు రమేశ్, పిచ్చయ్య, సుధాకర్‌రెడ్డి, రంగయ్య, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News