Monday, January 20, 2025

రైతు వేదికల ద్వారా రైతుల రుణాలను మాఫీ చేయాలి

- Advertisement -
- Advertisement -
కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : రైతు వేదికల ద్వారా రైతుల రుణాలను మాఫీ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణలో డ్రిప్ ఇరిగేషన్ లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ జగిత్యాల జిల్లాకు ఇరిగేషన్ పరంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. ఈ ప్రభుత్వ వచ్చిన తరువాత విద్యుత్ ఉత్పాదన ఎక్కడ పెరిగిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సబ్ స్టేషన్ల వద్ద లాగ్ బుక్ ఎందుకు దాచిపెడుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి లిక్కర్ మీద ఉన్న ఆసక్తి వ్యవసాయం మీద లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని చూసి బిఆర్‌ఎస్ నేతలు భయపడుతున్నారన్నారు. తమ పార్టీపై మాటల దాడి చేసేందుకు బిఆర్‌ఎస్, బిజెపి కలిసి నిర్ణయం తీసుకున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News