Thursday, January 23, 2025

రెజ్లర్ల నిరసనలపై రేపు యుపిలో రైతుల మహాపంచాయత్

- Advertisement -
- Advertisement -

ముజఫర్‌నగర్(యుపి): లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెరడేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా రెజ్లర్లు సాగిస్తున్న నిరసలపై చర్చించేందుకు ముజఫర్‌నగర్‌లోని సోరం గ్రామంలో గురువారం మహా పంచాయత్ నిర్వహిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(బికెయు) నాయకుడు నరేష్ తికాయత్ తెలిపారు.

రెజ్లర్ల నిరసనలపై మహా పంచాయత్‌లో సమగ్రంగా చర్చించనున్నట్లు కల్యాణ్ ఖాప్ అధ్యక్షుడైన నరేష్ తికాయత్ మంగళవారం రాత్రి ఇక్కడ వెల్లడించారు.

బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోనందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూఅంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలలో తాము సాధించిన పతకాలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి మహిళా రెజ్లర్లు మంగళవారం హరిద్వార్ చేరుకోగా వారితో ఖాప్, రైతు నాయకులు సమావేశమై వారి సమస్యను తర్చడానికి ఐదు రోజుల వ్యవధి కోరారు. దీంతో రెజ్లర్లు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుని ఢిల్లీ తిరుగు ప్రయాణమయ్యారు.

మహిళా రెజ్లర్ల నిరసనలపై తదుపరి కారాచరణను నిర్ణయించడానికి ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ నుంచి వేర్వేరు ఖాప్‌లకు చెందిన ప్రతినిధులు, అధినేతలు గురువారం నాటి మహాపంచాయత్‌కు తరలిరానున్నట్లు నరేష్ తికాయత్ తెలిపారు.

నూతన పార్లమెంట్ భవనం ప్రారంబోత్సవం నాడే ఆ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించిన మహిళా రెజ్లర్లను శాంతి భద్రతల ఉల్లంఘన కింద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News