Wednesday, November 20, 2024

రైతు బంధు లేదు… గోస పడుతున్నాం

- Advertisement -
- Advertisement -

దేవరకద్ర: వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలం నేలివిడి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులను మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. రైతులు తమ గోడును హరీష్ రావుకు చెప్పుకున్నారు. తక్కువ ధరకే పండించిన పంటను అమ్ముకుంటున్నామని, ఇరవై రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ఎదురు చూస్తున్నామని, వడ్లను ఇంకా క్లీన్ గా చేయాలని, ఎండ బెట్టాలని అధికారులు అంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మమ్మల్ని చంపనీకి మా పొట్ట కొట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు’ అని హరీష్ రావు ఎదుట రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. మహిళలకు 2500 లేవని, రైతు బంధు లేదు అని, గోస పడుతున్నామన్నారు.

కురుమూర్తి దేవుని మీద రేవంత్ రెడ్డి ఒట్టు పెట్టి మాట తప్పాడన్నారు. రుణమాఫీ సగం మందికి కాలేదని, ధాన్యం బయట అమ్ముకుంటున్నామని హరీష్ రావుకు తెలియజేశారు. సన్న వడ్లు కూడా బయటికి అమ్ముకుంటున్నామని వివరించారు. అంతకు ముందు దేవరకద్ర నియోజకవర్గంలో కురుమూర్తి స్వామిని  మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు దర్శించుకున్నారు.  ఈ కార్యక్రమంలో రైతులు గొల్ల కృష్ణయ్య,బాలనగన్న, శేషన్న, లక్ష్మయ్య, సత్యమ్మ, రాధమ్మ శాంతమ్మతో పాటు రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్, మాజీ ఎమ్మెల్యే లు, ఆర్ ఎస్ ప్రవీణ్, మాజీ కార్పొరేషన్ చెర్మన్లు పాల్గొన్నారు. పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News