రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి
జిల్లాలో 1,68,375 రైతులకు రైతుబంధు ద్వారా యాసంగికి రూ. 226 కోట్లు
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
మన తెలంగాణ/నర్సాపూర్ (జి): రైతుల సంక్షే మం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని దేవాదాయ, న్యాయ, గృహ నిర్మాణ శా ఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన రైతుబం ధు సంబరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ముం దుగా రైతులు ఎడ్ల బండ్లతో ఊరేగింపుగా మంత్రికి స్వాగతం పలుకుతూ రైతు వేదిక వద్దకు తరలివెళ్లా రు. ఈ సందర్భంగా మంత్రికి మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా సీఎం చి త్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రైతుబంధు పథకం కింద నిర్మల్ జిల్లాలో యాసంగి పంటకు రూ. 226 కోట్లు రూ. 1,68,375 మంఇ రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అనాన రు. రైతులు పంటలు పండించినా పండించకపోయినా వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు అమలు చేసి రైతులను ఆదుకుంటుందని అన్నారు. ఈ పథకం కింద రూ. 50 వేల కోట్లు రైతులకు చెల్లించిందన్నారు. ఈ నెల 10 వ తేది వరకు రైతుల ఖాతాల్లో రైతుబం దు సాయం జమ అవుతుందని పేర్కొన్నారు. గతం లో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర రానుందని పంట మార్పిడి పద్దతిని ఎంచుకున్నారని నేడు ఎఫ్‌సీఐ వరిధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్దంగా లేనందున వరికి బదులుగా లాభసా టి పంటల సాగు చేయాలన్నారు. పత్తికి క్వింటాళు కు రూ. 9600 లభిస్తుండగా ఎంతో మేలు రకం వ రి ధాన్యం పండించినా క్వింటాళుకు రూ. 2500 మాత్రమే వస్తుందన్నారు. ధరణి పోర్టల్ ప్రవేశపెట్ట గా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వివాదాలు, జాప్యం లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నా రు. మండల కేంద్రంలో ఇటీవల ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, రోడ్లు ప్రణాళిక బద్దంగా నిర్మించడంతో పట్టణం ఎంతో అందంగా రూపుదిద్దుకుందన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాలు ఎంతో అభివృద్ది చెందుతున్నాయన్నారు. గతంలో కొన్ని జిల్లాలో ఉపాధి కోసం వలసలు వెళ్లేవారని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పచ్చదనంతో పల్లెలు, పట్టణాలు ప్రగతిని సాధిస్తున్నాయన్నారు. గతంలో వా ర్షిక బడ్జెట్ రూ. 50 వేల కోట్లు ఉండేదని నేడు ఒక రైతుబందు పథకం కోసం రూ. 50 వేల కోట్లు ఖ ర్చు చేస్తుండడం గమనించదగ్గ విషయమన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృషి వల్ల నిర్మల్ జిల్లా దిన దినాభివృద్ది చెందుతోందని అన్నారు. రైతులు బా గుంటే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు సలహాలు పాటిస్తూ పంటలు సాగు చేసుకోవాలని అన్నారు. అనంతరం రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షు డు వెంకట్ రాంరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతుబంధు సంబరాలు 10 వ తేది వరకు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. రైతుల వెన్నంటే ఉంటూ వారి అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తోందన్నారు. ఈ సందర్భంగా రైతుబంధు సంబరాల కా ర్యక్రమంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గె లుపొందినవారికి బహుమతులను ప్రధానం చేశా రు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అ లీ పారుఖి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మీ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ గం డ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ నర్మదా ము త్యం రెడ్డి, డిసిసిబి చైర్మెన్ రఘునందన్ రెడ్డి, మండ ల రైతు బందు కోఆర్డినేటర్ కోటిరెడ్డి, గ్రంథాలయ చైర్మెన్ ఎర్రవోతు రాజేంధర్, సర్పంచ్ రాంరెడ్డి, జ డ్పిటిసి చిన రామయ్య, జిల్లా వ్యవసాయ శాఖ ఏడీ వినయ్ బాబు, రైతు సమితి జిల్లా అధ్యక్షులు నల్ల వెంకట్ రెడ్డి, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఎంపీడీవో ఉషారాణి, తహసీల్దార్ తుకారాం, ఉప సర్పంచ్ సాయేంధర్, గోపిడి గంగారెడ్డి, విలేజ్ క మిటీ భర్కుంట నరేందర్, ఏఈవోలు శ్రీనివాస్, గణేష్, ఏవో సాయికిరణ్, ఎంపీటీసీ మల్లేష్, పోలీ సు సిబ్బంది తదితరులు ఉన్నారు.