Saturday, January 11, 2025

రైతుల పాదయాత్ర మళ్లీ సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

హర్యానా భద్రత సిబ్బంది బాష్పవాయు ప్రయోగం
కొందరు రైతులకు గాయాలు
శంభు : ఢిల్లీకి పాదయాత్ర సాగిస్తున్న నిరసనకారులైన రైతులు తమలో కొందరికి బాష్పవాయు గోళాల వల్ల గాయాలు తగలదంతో తమ యాత్రను ఆదివారం నిలుపుదల చేశారు. పంజాబ్‌తో తమ రాష్ట్రం సరిహద్దులో శంభువద్ద మోహరించిన హర్యానా భద్రత సిబ్బంది బాష్సవాయు గోళాలు ప్రయోగించడంతో కొందరు రైతులు గాయపడిన దృష్టా నిరసనకారులు తమ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

కనీసం ఎనిమిది మంది రైతులు గాయపడ్డారని, వారిలో ఒకరిని చండీగఢ్‌లోని పిజి వైద్య విద్య, పరిశోధన సంస్థ (పిజిఐఎంఇఆర్)కు హుటాహుటిని తరలించారని పంజాబ్‌కు చెందిన రైతు నాయకుడు శర్వన్ సింగ్ పాంధెర్ వెల్లడించారు. “జాతా’ (101 మంది రైతుల బృందం)ను వెనుకకు పిలిపించాం’ అని పాంధెర్ శంభులో విలేకరులతో చెప్పారు. తమ ఫోరాలు సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా సమావేశం అనంతరం రైతులు తమ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తారు’ అని పాంధెర్ తెలిపారు.

రైతుల శంభు నిరసన ప్రదేశం నుంచి తమ పాదయాత్రను జాతా ఆదివారం మధ్యాహ్నం తిరిగి ప్రారంభించింది. కానీ, హర్యానా భద్రత సిబ్బంది ఏర్పాటు చేసిన బహుళ అంచెల బారికేడ్ల వల్ల వారి పాదయాత్ర నిలచిపోయింది. నిరసనకారులైన రైతులు బారికేడ్ల వద్దకు చేరుకోగానే వారిపై బాష్పవాయు గోళాలు ప్రయోగించారు, వారిని చెదరగొట్టేందుకు నీటి జెట్లు ఉపయోగించారు. దేశ రాజధాని అధికార యంత్రాంగం నుంచి అనుమతి పొందిన తరువాతే రైతుల సంఘాలు ఢిల్లీ వరకు పాదయాత్ర సాగించగలవని అంబాలా పోలీసులు అంతకుముందు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News