Monday, December 23, 2024

బిజెపి ఎంపి అరవింద్‌కు ‘రైతుల’ నిరసన ‘సెగ’

- Advertisement -
- Advertisement -

Farmers protest against BJP MP Arvind

వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలంటూ ఎంపి అరవింద్ ఇంటి ముందు ధాన్యం కుప్పలు పోసిన నిజామాబాద్ ఆర్మూర్ రైతులు పసుపు బోర్డు తెస్తానని మోసం చేసిన ఎంపికి ఈసారి వరి వేడి

మన తెలంగాణ/ ఆర్మూర్ : నిజామాబాద్ ఎంపి అరవింద్‌కు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పెర్కిట్‌లోని అరవింద్ నివాసం ఎదుట ధాన్యాన్ని కుప్పలుపోసి నిరసన వ్యక్తంచేశారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అబద్దపు హామీలతో మోసపూరిత వాగ్ధానాలతో రైతులను మభ్యపెట్టాలని చూస్తే ఎప్పటికైనా రైతులనుంచి ఎదురుదెబ్బ తగులుతుందని మరోసారి ఎంపి అరవింద్‌కు నిజం తెలిసొచ్చినట్లయ్యింది. మొదటిసారిగా ఎంపి ఎన్నికల్లో పోటీచేసినపుడు పసుపు బోర్డు తీసుకొస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేయడంతో అడుగడుగునా ఏ ఊరికి వెళ్లినా పసుపురైతుల నిరసన సెగలు తగలడంతో ఏ ఊరికీ వెళ్లలేని పరిస్థితి.

అయినా బుద్దిరాని అరవింద్ వరి రైతులను మరోసారి మోసగించారు. వరి వేసుకోండి మేమున్నామంటూ భరోసా నిచ్చి రైతులను తప్పుదోవపట్టించి ఇపుడు ముఖం చాటు చేయడంతో చైతన్యవంతులైన నిజామాబాద్, ఆర్మూర్ రైతులు శాంతియుతంగా ఎంపి అరవింద్ ఇంటిని ముట్టడించి వినూత్న రీతిలో వరి ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకొచ్చి ఎంపి అరవింద్ ఇంటి ముందు కుప్పలుగా పోసి బిజెపి నేతలు చెప్పితేనే వరి వేశాము, ఎలాగైనా కొనుగోలు కేంద్రాలద్వారా కేంద్రమే యాసంగి పంటను కొనిపించే బాధ్యత ఎంపి అరవింద్ తీసుకోవాలని, లేనిపక్షంలో బిజెపి నాయకులు రైతులనుంచి భవిష్యతులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని ఎంపి అరవింద్‌ను ఒక్క కంఠంతో హెచ్చరిస్తూ రైతులు నిరసన గళం వినిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News