మన తెలంగాణ/మర్రిగూడ : ప్రభుత్వం నిర్లక్షంతో ధాన్యం దళారులపాలవుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన పొనుగోటి అంజన్‌రావు గత బుధవారం గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలిసిన హరీశ్‌రావు బుధవారం ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అంజన్‌రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, అండగా ఉంటానని వారి కుమారుడు పొనుగోటి దేశముఖరావుకు భరోసా ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలో ఏ ర్పాటు చేసిన సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగితే, ఈ సంవత్సరం కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లు రావడం వల్ల ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని తెలిపారు.
అయితే సాగు జరిగిన కా రణంగా ఏడున్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం అంచనా వేసిందని, కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్షం వల్ల మూడు లక్షల మె ట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదని మండిపడ్డారు. దీంతో ప్ర భుత్వ నిర్లక్షం వల్ల ధాన్యం దళారుల పాలైందని వాపోయారు. సకాలంలో కొ నుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేక, గన్నీ బస్తాలు అందించలేక రైతులను ఇ బ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రైతులు రూ.1800 రూపాయలకు క్విం టాల్ చొప్పున దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చే శారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు ..నల్గొండ జిల్లాలో 9000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రూ.200 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటే అందులో రూ.50 కోట్లు మాత్రమే చెల్లించారని, రైతులకు సకాలంలో డబ్బులు అందించే
పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని ఎద్దేవా చేశారు.
వడ్లకు మద్దతు ధర వస్తలేదని రైతులు మిర్యాలగూడలో రాస్తారోకో చేసిన పరిస్థితి కొన్నా వడ్లకు కూడా విపరీతంగా తరుగు పెట్టి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో కూడా ఒక కిలో సన్న వడ్లను కొనలేదని, సన్న వడ్లను కొనే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి ఈ మధ్య మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైందని, వడ్లు, కొనకపోతే అధికారులను, మిల్లర్లను ఎందుకు కొనట్లేదని అడగడం లేదు కానీ.. మందు తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులను మెమోలు ఇస్తున్నారని ఆరోపించారు. మందు అమ్మకాల టార్గెట్ పెట్టి జనాలకు మందు ఎక్కువ తాగించి ఆదాయం పెంచాలని ఒత్తిడి చేస్తూ మెమోలిస్తూ బదిలీలు చేస్తున్నారని, 25 మంది సర్కిల్ ఇన్సెక్టర్ల్లకు మెమోలు జారీ చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ప్రభుత్వం ప్రకటించింది కానీ ప్రభుత్వ పరిస్థితి చూస్తుంటే 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి దళారుల వచ్చి తెలంగాణలో రైతుల వద్ద తక్కువ రేటుకు ధాన్యాన్ని కొంటున్నారని తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేశారని, రేవంత్‌రెడ్డి రాజ్యంలో రైతులు దుఃఖపడుతున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలులోనే కాదు. పత్తి కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.15వేలు రైతుబంధు రైతులకు ఇవ్వాలని బిఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎంఎల్‌ఎ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పాల్వాయి స్రవంత్‌రెడ్డి, నకిరేకల్ మాజీ ఎంఎల్‌ఎ చిరుమర్తి లింగయ్య, బాలల హక్కుల కమిషన్ సభ్యుడు పొనుగోటి అంజన్‌రావు, మునగాల వెంకటేశ్వరరావు, మర్రిగూడ మాజీ సర్పంచ్ నల్ల యాదయ్యగౌడ్, దంటు జగదీశ్వర్, బచ్చు రామకృష్ణ, మెండు మోహన్‌రెడ్డి, చెరుకు లింగంగౌడ్, ఉరిపక్క నగేష్, కొలుకులపల్లి యాదయ్య, వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్లు పందుల యాదయ్యగౌడ్, బాలం నరసింహ, వల్లంల సంతోష్‌యాదవ్, తోటకూర శంకర్ యాదవ్ పాల్గొన్నారు.