Sunday, December 22, 2024

మిల్లర్ల మిలాఖత్ రైతుకు ధోకా

- Advertisement -
- Advertisement -

సన్న రకం వడ్లకు దక్కని మద్దతు ధర
మార్కెట్‌కు పోటెత్తుతున్న ధాన్యం
మిల్లుల వద్ద బారులు తీరిన ట్రాక్టర్లు
ఇదే అదనుగా మిల్లర్ల సిండికేట్
రూ.2100కే ధాన్యం కొనుగోలు
మిర్యాలగూడలో రోడ్డెక్కిన రైతులు
భారీగా స్తంభించిన ట్రాఫిక్

మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో: ‘అమ్మబోతే అడవి.. కొనబోతే కొరవి’ అన్న చందంగా రైతన్న పరిస్థితి తయారైం ది. ఎండనక వాననక.. రేయనక పగలనక.. ఆరుగాలం క ష్టపడి కష్టనష్టాలకోర్చి పంట పండిస్తే చి‘వరి’లో అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. వానాకాలంలో పంటలు బాగా పండి దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో ఈసారి చేసిన అప్పులైనా తీరుతాయని అనుకుంటున్న రైతులకు ఆశాభంగమే ఎదురవుతోంది. ఓ పక్క పంట చేతికొచ్చే సమయంలో అకాలవర్షాలు దెబ్బతీస్తుం టే..మరోపక్క మిల్లర్లు సిండికేట్‌గా మారి మద్దతు ధరకు మంగళం పాడుతున్నారు. మద్దతు ధరతో పాటు ఐదువందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రభుత్వం అంటున్నా రైతుకు మద్దతు దక్కడం లేదు. వరికోతలు ప్రారంభమైన తొ లినాళ్ళలో సన్నరకం వడ్లు క్వింటా రూ.2500 నుండి రూ.2600 వరకు ధర పలికింది. కోతలు ముమ్మరంగా జ రుగుతుండటం.. వందల ట్రాక్టర్లలో ధాన్యం బోరెలు మిల్లులకు వస్తుండటంతో మిల్లర్లు ఒక్కసారిగా ధరను తగ్గించేశా రు. నల్లగొండ జిల్లా,

మిర్యాలగూడ ప్రాంతంలోని మిల్లర్లు అంతా సిండికేట్‌గా మారి మిల్లులకు వచ్చిన ధాన్యం కొనుగోలు చేయకుండా కృత్రిమ కొరత సృష్టిస్తూ మద్దతు ధరను తుంగలో తొక్కుతున్నారు. అకాలవర్షాల ముప్పు పొంచి ఉండటంతో రైతులు ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకువస్తున్నా రు. సన్నరకం వడ్లు మిల్లులకు ఇబ్బడిముబ్బడిగా వస్తుండటాన్ని ఆసరాగా తీసుకున్న మిల్లర్లు ధరను పడేశారు. ఇప్పు డు క్వింటా ధర కేవలం రూ.2100 నుండి రూ.2200 రూ పాయల వరకే పలుకుతోంది. అన్నదాతలు తప్పనిసరి స్థి తుల్లో వచ్చినకాడికి చాలు అన్నట్లుగా అమ్ముకుంటున్నారు. కానీ ఆదివారం మిల్లర్లు అంతా ఒక్కటై అసలు కొనుగోళ్ళే నిలిపివేశారు. ఏ ఒక్క మిల్లర్ కూడా ధాన్యం తీసుకోకుండా ఆపేశారు. దీంతో వందల ట్రాక్టర్లు మిల్లుల ముందు బా రులు తీరాయి.వరికోతలు కోసి మిల్లులకు తీసుకువస్తే కొ నుగోలు చేయకుండా మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నా రు.. మద్దతు ధర పెట్టమంటే పెట్టడంలేదు..

మీఇష్టం అ యితే అమ్మండి.. లేకపోతే తీసుకుపోండి.. అంటూ మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ ధాన్యం ట్రాక్టర్లతో అ న్నదాతలు రోడ్డెక్కారు. మిర్యాలగూడలోని మిల్లుల వద్ద ట్రాక్టర్లను రోడ్లపై పెట్టి ధర్నా చేశారు. నార్కట్‌పల్లి టు అద్దంకి.. మిర్యాలగూడ టు హుజూర్‌నగర్ రహదారిపై గంటపాటు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తం భించింది. ధాన్యం కోనుగోళ్ళు ప్రారంభించడంతో పాటు మద్దతు ధర పెట్టాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకోని రైతన్నలకు నచ్చచె ప్పి రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం మిల్లుల్లో ధా న్యం కొనుగోలు ప్రారంభించడంతోధర్నాను విరమించారు.

సన్నధాన్యం మిల్లులకే..
నల్లగొండ జిల్లాలో వానాకాలంలో 10 లక్షల ఎకరాలకు పైగానే వరిపంట సాగుచేశారు. ఈ సీజన్‌లో 6.36 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం.. 5.65 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డుధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అం చనా వేశారు. అందుకు అనుగుణంగా 340 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో 260 కేంద్రాలు దొడ్డురకం ధాన్యం.. 80 కేంద్రాల్లో సన్నధాన్యం కొనుగోలు చేసేవిధంగా ప్రారంభించారు. సన్నధాన్యానికి క్వింటాకు రూ.2320 మద్దతు ధరతో పాటు రూ.500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ తేమ శాతం 17లోపు ఉండాలనే నిబంధన పెట్టింది. సన్నధాన్యం కోసింది కోసినట్లుగానే పచ్చివడ్లు (తేమ శాతం ఎక్కువగా ఉంటుంది) వస్తుండటంతో కొనుగోలు కేంద్రాల్లో వాటిని కొనుగోలు చేయడంలేదు. దీంతో అన్నదాతలు కొంతరేటు తక్కువైనా మిల్లులకు తరలించి అమ్ముకుంటున్నారు. ఇప్పటివరకు ఏఒక్క సెంటర్‌లో కూడా సన్నధాన్యం గింజ కూడా కొనుగోలు చేయలేదు. కానీ అధికారులు ట్రక్‌షీట్లు మాయచేసి కొనుగోలు చేసినట్లుగా బోనస్ కొట్టేసే ప్రమాదం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా సన్నరకం ధాన్యానికి బోనస్ ఏమోగానీ మద్దతే కరువైందని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News