Friday, November 22, 2024

అర్వింద్‌కు పసుపు దెబ్బ

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద రైతుల నిరసన

ఇంటి ముంగిట పసుపు
కొమ్ముల పోగు
పసుపు బోర్డు
తెచ్చేవరకూ వదిలేది
లేదని హెచ్చరిక

మన తెలంగాణ/ఆర్మూర్: నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్‌కు ఆర్మూర్ పసుపు రైతుల ఘాటు తగిలింది. పసుపు బోర్తు తెస్తానని ఎన్నికల ముందు బాండు పేపరు రాసిచ్చి మాట తప్పి.. అడిగిన వారిని బెదిరిస్తూ దాటవేస్తున్న అరవింద్‌ను పసుపు రైతులు వినూత్న రీతిలో నిరసన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పసుపు బోర్డుపై ఇంకా మీనమేషాలు లెకిస్తూ.. ధిక్కారస్వరం వినిపిస్తున్న ఎంపి అర్వింద్ ఆదివారం పసుపు రైతులు చుక్కలు చూపించారు. మండలంలోని పెర్కిట్ గ్రామంలోని ఎంపి అర్వింద్ ఇంటిని ముట్టడించి పసుపు పంటను పారబోశారు. వందలాది మంది రైతులు ఎంపి ఇంటిని దిగ్బంధంచేసి అర్వింద్ డౌన్‌డౌన్, మోడీ డౌన్, పసుపు బోర్డు తెచ్చేవరకు వదలం… పసుపు బోర్డు సాధించే బాధ్యత అర్వింద్‌దే, రైతుల ఐక్యత వర్ధిల్లాలి.. అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. కాగా, ఇటీవల మాజీ ఎంపి, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత కూడా నిజామాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ఎంపి అర్వింద్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం విధితమే. గడిచిన మూడేళ్లలో ఎంపి అరవింద్ రైతులను తీవ్రంగా నిర్లక్షం చేశారని, పసుపు బోర్డు ఎపుడు తెస్తారో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. మూడేళ్లుగా ఎంపి అర్వింద్ రైతులను మభ్యపెట్టిన అంశాలను ఆధారాలతో సహా బయటపెట్టారు.

నీతి లేని నేత ఎంపి అర్వింద్

ఈ సందర్భంగా పలువురు రైతు నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపి అర్వింద్ రైతు ద్రోహి అని, నీతి నియమాలులేని నేత అని మండిపడ్డారు. రైతులను మోసగిస్తే సహించేదిలేదని వార్నింగ్ ఇచ్చారు. గత ఎన్నికల సందర్భంగా ఎంపిగా తనను గెలిపిస్తే ఐదు రోజుల్లోగా పసుపు బోర్డు తెస్తానని, లేనిపక్షంలో ఎంపి పదవికి రాజీనామా చేసి రైతు ఉద్యమంలో పాల్గొంటానని బాండ్ పేపర్ రాసిచ్చాడని రైతు నేతలు గుర్తు చేశారు. దానిని ఏ అటక మీద దాచిపెట్టావని మండిపడ్డారు.

పసుపుబోర్డు తెచ్చే బాధ్యత అర్వింద్‌దే

పసుపు బోర్డు ఏదనడిగితే బెదిరిస్తావా..? నా వెనక కేంద్ర బలగాలున్నాయి.. నా దగ్గర ఎకె 47 గన్నులున్నాయంటూ విర్రవీగకుండా, ఇక్కడ ఎలాంటి రౌడీయిజం చేయకుండా ఢిల్లీ పోయి మోడీ కాళ్లు పట్టుకునైనా పసుపు బోర్డు సాధించు.. లేదంటే గ్రామాల్లో తిరగనవవ్వం.. మమ్మల్ని ఏడిపిస్తున్నవ్.. మేము అప్పులఊబిలో కూరుకపోయేలా చేశావు.. కూలీలకు జీతాలు చెల్లించడానికి కూడా గతిలేదు.. మా ఉసురు తగల్తది అంటూ రైతులు శాపనార్థాలు పెట్టారు. ఇది ట్రయల్స్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని, మాట నిలుపుకోకపోతే జిల్లాలో అడుగుపెట్టనివ్వబోమని, జిల్లాలో అడుగుపెడితే తరిమివేస్తామని వారు హెచ్చరించారు. ఆందోళనలో జిల్లా పసుపు రైతులు, మహిళా రైతులు, నాయకులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News