Sunday, January 12, 2025

టమాటా @ రూ.1

- Advertisement -
- Advertisement -

దళారుల మాయాజాలంతో టమాటా పండించిన రైతన్నలు విలవిలలాడుతున్నారు. టమాటా @ రూ.1కి దారుణంగా పతనమైంది. ఇందుకు గల కారణాలనేకం. నిన్న మొన్నటి వరకూ టమాటా ఓ మోత మోగించింది. కొనాలంటేనే భయపడేలా చేసింది. సెంచరీ కొట్టి టమాటా సామాన్యులకు సవాల్ విసిరింది. ఆ తర్వాత చాలా రోజుల వరకూ అరవై రూపాయలు, కొద్దిరోజుల నుంచి నలభై రూపాయలు పలుకుతోంది. అయితే, మారుతున్న మార్కెట్ పరిస్థితులతో టమాటా రేటు చిన్నగా దిగొచ్చింది. కొంతకాలంగా హెచ్చు తగ్గులతో నడుస్తున్న టమాటా ధర.. ప్రస్తుతం ఒక్కసారిగా పతనమయింది. ఎంతలా అంటే.. ఊహించని రేంజ్‌లో పడిపోయింది. కిలో వంద రూపాయల వరకూ పలికిన టమాటా.. ఇప్పుడు ఒక్కరూపాయికి చేరుకోవడం టమాటా రైతులకు షాకిస్తోంది. టమాటా పండించిన రైతులను కోటీశ్వరులను చేసినట్లే, బిక్షగాళ్లను కూడా చేస్తుంది. అందుకే టమాటా ధర కొన్ని నెలలు మాత్రం పెరుగుతుంటుంది.

ప్రధానంగా సెప్టంబరు నుంచి నవంబరు నెల వరకూ టమాటా ధర బాగా ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు చెప్పారు. ఆ సమయంలో పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతులు తక్కువగా వస్తుంటాయి. టమాటా ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్లనే ధరలు ఆ సమ యంలో విపరీతంగా పెరుగుతుతాయి. మళ్లీ డిసెంబరు నెల నుంచి టమాటా పంట చేతికి అందుతుంది. అన్ని మార్కెట్ లో రాశులు పోసి రైతులు విక్రయించేందుకు సిద్ధమవుతుంటారు. ఈ సమయంలో టమాటా ధర తక్కువగానే ఉంటుంది. వినియోగదారుడికి కూడా కిలో ఐదు రూపాయల నుంచి పది రూపాయలకు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం టమాటా ధర బాగా పడిపోయింది. పత్తికొండ రైతు మార్కెట్లో కిలో టమోటా ధర రూపా యికి పడిపోవడంతో టమోటా రైతు ఆందోళన చెందుతున్నాడు. హైదరాబాద్ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో టమోటా ధర తగ్గిందని చెబు తున్నారు. మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పారు.

నిన్న మొన్నటి దాకా కిలో పది నుండి 20 రూపాయలు పలికిన టమోటా ధర ఇప్పుడు రూపాయికి పడిపోవడంతో రైతు లబోదిబో మంటున్నాడు. టమాటా రైతు పరిస్థితి లాటరీలాగా మారింది. కనీ సం రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధర కుప్ప కూలి ఒక్క రూపాయికి పడిపోయింది. కిలో టమాటా రూపాయి పలకడంతోపాటు రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తెచ్చిన పంటను కొనడా నికి కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో టమాటాలను రోడ్డు పక్కన పారబోసి వెళ్లిపోయారు రైతులు. అయితే పలు ప్రాంతాల నుంచి భారీగా టమా టా దిగుబడి వస్తుండటమే రేటు పడిపోవడానికి కారణమని స్థానిక రైతులు అంటున్నారు. సరుకు ఎక్కువ ఉండడంతో మార్కెట్‌లో టమాటా కొనే వారు లేకుండా పోయారని చెప్తున్నారు. ప్రధానంగా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకూ పంట దిగుబడి తక్కువగా ఉండడంతో టమాటా ధర ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు అంటున్నారు.

అదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతులు తక్కువగా వస్తుంటాయని తెలి పారు. కానీ.. డిసెంబర్ నుంచి టమాటా పంట చేతికి వస్తుండడంతో అన్ని మార్కెట్‌లలో రాశులు పోసి రైతులు విక్రయించేందుకు సిద్ధమవుతుం డడంతో టమాటా ధర తక్కువగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా.. పతనమవుతున్న టమాటా ధర రైతులకు కన్నీళ్ళు మిగుల్చుతోంది.

భాగ్యనగరంలో కిలో 40 రూపాయలు పలుకుతున్న టమాటా
ఇతర ప్రాంతాలలో కిలో రూపాయి పలుకుతున్న టమాటా హైదరాబాదు లాంటి ఏరియాలలో కిలో 30 నుంచి 40 వరకు పలుకుతోంది. సెప్టెంబర్ – నవంబర్, డిసెంబర్ తొలి వారంలో టమాటా కిలో 70 రూపాయల వరకు చేరుకుంది. డిమాండ్ కూడా అధికంగా ఉంది. ఎపిలో రూపాయి మాత్రమే పలుకుతున్న టమాటా హైదరాబాదు లాంటి ప్రాంతాలకు వచ్చేసరికి 400 రెట్లు పెరగడం గమనార్హం. అయితే మధ్యలో వ్యాపారులు రవాణా ఖర్చులని, ఇతర ఖర్చులని చెప్పి ధరలను అమాంతం పెంచుతున్నారు. పండించిన రైతులు నష్టపోతుంటే వారు మాత్రం కోట్లను గడిస్తున్నారు. ఆరుగాలం పంట పండించిన రైతులకు మాత్రం అప్పులను, పుట్టెడు కష్టాలను మిగుల్చుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News