Sunday, January 12, 2025

శంభు బార్డర్ లో రైతులపై భాష్పవాయు ప్రయోగం!

- Advertisement -
- Advertisement -

పంజాబ్, హర్యానా రాష్ట్రల మధ్య ఉన్న శంభు బారియర్ వద్ద న్యూఢిల్లీకి మార్చ్ చేస్తుండగా రైతులపై భాష్ఫవాయు ప్రయోగం జరిగింది. వారంతా తమ పంటకు సరైన గిట్టుబాటు ధరను కోరుతున్నారు. సంయుక్త కిసాన్ మోర్చ, కిసాన్ మజ్దూర్ మోర్చా బ్యానర్ కింద  రైతుల ‘జఠా’(గ్రూప్) ఢిల్లీ పార్లమెంటు వైపు మార్చ్ నిర్వహించింది.  తమ పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి, విద్యుత్తు టారిఫ్ లు పెంచకూడదు, రుణ మాఫీ చేయాలి, రైతులకు, రైతు కూలీలకు పింఛన్లు ఇవ్వాలి, లఖింపూర్ ఖేరి లో 2021లో జరిగిన హింసాకాండలో బాధితులైన వారికి న్యాయం జరగాలి అన్నది వారి డిమాండ్.

రైతుల నిరసన శంభు బార్డర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు మొదలయింది. హర్యానాలోని అంబాల జిల్లాలో ఉన్న శంభు బార్డర్ వద్ద సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు. రైతులు ముందస్తుగా అనుమతి తీసుకోలేదని పోలీసులు వాదించారు. అనేక చోట్ల పోలీసులను మోహరించారు. అయినప్పటికీ హర్యానాలోని కీలక రైతు సంఘాలు ‘ఢిల్లీ ఛలో’ ఉద్యమాన్ని చేపట్టి ముందుకు నడిచాయి. కానీ వారిపై భాష్ప వాయువు ప్రయోగించి వారి ఢిల్లీ మార్చ్ ను దెబ్బతీయాలని చూశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News