Thursday, April 3, 2025

21న నాలుగు రాష్ట్రాల్లో రైతుల ధర్నాలు

- Advertisement -
- Advertisement -

ముజఫర్‌నగర్ (యుపి) : ఎంఎస్‌పికి చట్టబద్ధతతో సహా తమ డిమాండ్ల సాధన కోసం రైతులు ఈ నెల 21న ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ధర్నాలు నిర్వహిస్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నేత రాకేష్ తికాయత్ శనివారం ప్రకటించారు. ముజఫర్‌నగర్‌లోని సిసౌలిలో ఒక పంచాయత్‌కు హాజరైన అనంతరం తికాయత్ విలేకరులతో మాట్లాడుతూ,

రైతుల డిమాండ్లను కేంద్రం ఆమోదించని పక్షంలో ఈ నెల చివరి వారంలో ఢిల్లీకి ట్రాక్టర్ యాత్ర ప్రారంభించవలసిందిగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం)ను కోరుతూ ఈ సమావేశంలో ఒక తీర్మానం చేసినట్లు తెలియజేశారు. తమ డిమాండ్లను ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎస్‌కెఎం, కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపు ఇచ్చిన రైతుల ‘ఢిల్లీ చలో’ యాత్ర శనివారం ఐదవ రోజులోకి ప్రవేశించిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News