న్యూస్ నెట్‌వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన ధాన్యం ఆరబోత, పంట కల్లాలపై కేంద్రం కుట్రలను నిరసిస్తూ టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లా, నియోజకవర్గ కేం ద్రాల్లో మంత్రులు, రైతులు, బిఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళనలు చేపట్టారు. ఉపాధి హామీ పథకం కింద వెచ్చించిన రూ. 151కోట్లను తిరిగి చెల్లించాలంటూ కేంద్ర నో టీసులివ్వడాన్ని ఈ సందర్భంగా నేతలు తూ ర్పారాపట్టారు. రాష్ట్ర రైతాంగానికి నిర్మించి ఇ చ్చిన పంట కల్లాల నిధులను తిరిగి ఏలా ఇవ్వమంటారని రైతు నాయకులు నిలదీశారు. కల్లా లు కట్టొద్దంటే రైతుల పక్షాన బిజెపి నాయకుల గల్లాలు పట్టి నిలదీస్తామని పియూసి చైర్మన్, ఆర్మూర్ ఎంఎల్‌ఎ ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర బిఆర్ ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. తెలంగాణ పట్ల కేంద్రం అవలంభిస్తున్న కక్షపూరిత విధానాన్ని విడనాడాలని అ టవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జయశంకర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కల్లాల నిర్మాణాలను తప్పుబడుతూ రాష్ట్ర ప్ర భుత్వం నుంచి రూ.151కోట్లను కేంద్రం రికవరీకి నోటీసులివ్వడాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎంఎల్‌సి కౌసిక్ రెడ్డి తప్పుపట్టారు. వికారాబాద్, పరిగి ఎంఎల్‌ఎలు డాక్టర్ మెతుకు ఆనంద్, మహేష్ రెడ్డి వికారాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సిద్దిపేటలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో బిఆర్‌ఎస్ శ్రేణులు, అన్నదాతలు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాలో పాల్గొని కేంద్రం తీరును ఎండగట్టారు. జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఎంఎల్‌ఎలు విద్యాసాగర్ రావు, సంజీవ్ కుమార్, జడ్పి చైర్‌పర్సన్ దావా వసంతల ఆధ్వరంలో ఆందోళన చేశారు. కాగా, కొత్తగూడెంలో కేంద్రం తీరును నిరసిస్తూ బిఆర్‌ఎస్ శ్రేణులు ఆ పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకూ పాదయాత్ర చేశారు.
ఆందోళనకు ఎంఎల్‌ఎలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, మోచ్చా నాగేశ్వరరావు, హరిప్రియా నాయక్ పాల్గొన్నారు. మంచిర్యాల ఔబి చౌరస్తా వద్ద బిఆర్‌ఎస్ మహా ధర్నా చేశారు. ఆందోళనలో ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య, జడ్పి చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మిపంట కల్లాల నిధులను తిరిగి ఇవ్వాలని కేంద్రం ధర్నా చేశారు. సూరాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో కేంద్రం తీరును నిరసిస్తూ మహా ధర్నా చేశారు. కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎంఎల్‌ఎలు గాదరి కిషోర్ కుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌లు మాట్లాడారు. బిజెపికి బిఆర్‌ఎస్ పార్టీ కంటిలో నలుసుగా మారుతుందనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకంలో ఖర్చు చేసిన నిధులను తిగిరి చెల్లించాలని కేంద్రం చేస్తున్న దాడిని రైతులంతా తిప్పి కొట్టేందుకు పోరాటాన్ని ఉధృతం చేయాలని వరంగల్ జిల్లా ఎంఎల్‌ఎలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డిలు రైతులకు పిలుపునిచ్చారు.
స్థానిక ఆజాంజాహి మిల్లు గ్రౌండ్‌లో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆందోళనలో ఎంఎల్‌సి బండా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ గడియారం సెంటర్లో కేంద్రం తీరును నిరసిస్తూ చేపట్టిన ధర్నాలో ఎంఎల్‌ఎలు రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లబోతు భాస్కరరావు, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఫిష్ గోట్ చైర్మన్ దూదిమెట్ల బలరాజ్ యాదవ్, ట్రైకర్ చైర్మన్ రాం చందర్ నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రైతు కల్లాలపై కుట్రలు చేస్తూ నిధులు వెనక్కి చెల్లించాలని హుకూం జారీ చేయడం పట్ల హనుమకొండలో జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాలసముద్రంలోని ఏకశిలా పార్కు వద్ద ఆ పార్టీ శ్రేణులు మహాధర్నా చేశారు. ఆందోళనలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎంఎల్‌సి కడియం శ్రీహరి, ఎంఎల్‌ఎలు రాజయ్య, వొడితల సతీష్‌కుమార్, మేయర్ తదితరులు పాల్గొన్నారు.