- Advertisement -
కామారెడ్డి: మాస్టర్ ప్లాన్ లో భాగంగా తనకున్న ఎకరం సాగు భూమి గ్రీన్ జోన్లో పోతుందని మనస్థాపం చెందిన ఓ రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం… విలీన గ్రామమైన రామేశ్వరం పల్లికు చెందిన మర్రి బాలక్రిష్ణ తన భూమి మాస్టర్ ప్లాన్ వల్ల గ్రీన్ జోన్లో పోతుందని ఆవేదనకు గురై మంగళవారం మధ్యాహ్నం పోలానికి చల్లే గడ్డిమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -