- Advertisement -
కల్వకుర్తి ః కల్వకుర్తి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో కరెంట్ కోతలకు నిరసనగా ఆదివారం గ్రామ రైతులు సబ్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులు కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక వైపు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నా వ్యవసాయ పొలాల వద్ద ఆ సరఫరా లేదని, కరెంట్ ఎప్పుడు వస్తుందో,
ఎప్పుడు పోతుందో తెలియక రోజు మొత్తం కరెంట్ కోసం ఎదురు చూడక తప్పడం లేదని రైతులు తెలిపారు. యాసంగి పంటలను దృష్టిలో ఉంచుకుని కనీసం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా కరెంట్ వదలాలని కోరారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈ రైతులతో చరవాణి ద్వారా మాట్లాడుతూ రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ నిరసనలో గ్రామ రైతులు పాల్గొన్నారు.
- Advertisement -