Monday, December 23, 2024

రైతు బాంధవుడు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -
  • జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ

తొగుట: రైతు సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఆర్ కృషి చేస్తూ చరిత్రలో నిలిచిపోయారని జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. మండల కేంద్రమైన తొగుటలో బుధవారం సిఎం కెసిఆర్ చిత్రపటానికి బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు పంట పెట్టబడి కోసం 11వ విడత రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో విడుదల చేయడం జరుగుతుందన్నారు. గతంలో పంట పెట్టుబడుల కోసం రైతులకు పెద్దఎత్తున సమస్యలు ఎదురయ్యేవని నేడు రైతుబంధు పథకం ద్వారా ఎంతో భరోసా జరుగుతుందన్నారు. గతంలో సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో సాగునీటి గోస తీరిందన్నారు. కరువు కాటకాలతో ఉన్న తెలంగాణ నేడు పచ్చని పంట పొలాలతో పంజాబుకు దీటుగా దిగుబడులు సాదిస్తూ ధాన్యాగారంగా మారిందన్నారు. 9 ఏళ్ల తెలంగాణ దశ, దిశ మార్చిన సిఎం కెసిఆర్‌కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ప్రతినిధులు, నాయకులు హరికృష్ణారెడ్డి, జీడిపల్లి రాంరెడ్డి, దోమల కొమురయ్య, కంది రాంరెడ్డి, యాదగిరి, చిలువేరి రాంరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి , నర్సింలు, చంద్రారెడ్డి, లలిత రమేశ్, స్వామి, అరుణ్‌కుమార్, వికాస్, అబీద్‌హుస్సెన్ తదితరులు పాల్గొన్నారు.

తల్లిబిడ్డకు రక్షణ సిఎం కెసిఆర్

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత ఉందని నేడు పేదింటి వదువు పెళ్లికి కళ్యాణలక్ష్మి , షాదీ ముబారక్ ఫథకం ఎంతో భరోసా ఇస్తుందని జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. తొగుట మండల పరిషత్ కార్యాయలంలో బుధవారం మండలంలోని 15 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం కెసిఆర్, మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆధ్వర్యంలో ప్రజారోగ్యంకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. నేడు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు లత నరేందర్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, కొమురయ్య, రాంరెడ్డి, జహీద్, శ్రీదర్, రాంరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, నర్సింలు, లలిత, స్వామి, చంద్రారెడ్డి, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News