Friday, December 27, 2024

రేవంత్ కు పోస్టు కార్డులు పంపిన రైతులు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట నుంచి పోస్టు కార్డు ఉద్యమానికి రైతులు తెరలేపారు. ముఖ్యమంత్రి రేవంత్ కు పోస్టు కార్డుల ద్వారా రైతుల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ లో, చిన్నకోడూర్ మండలం మార్కెట్ యార్డ్ లో రైతులు స్వచ్చందంగా సిఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు హామీలు అమలు చేయక పోవడంతో రైతులు ఆవేదన చెందారు. పోస్ట్ కార్డు ద్వారా తమ ఆవేదనను సిఎం రేవంత్ కు పంపారు.. రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వరి ధాన్యానికి ఇస్తానన్నరూ.500 బోనస్, రైతు భరోసా 10,000లకి బదులు 15000 రూపాయలు, రైతు కూలీలకు ఇస్తానన్న రూ.12000, రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు, రైతు బీమా, వర్షాలు రాక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా రూ. 25000 ఎప్పుడు ఇస్తారని రైతన్నలు రేవంత్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. వెంటనే అమలు చేసి రైతు సోదరులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు రాసి పంపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఎంపి ఎన్నికల్లో తమ ఓటుతో గుణపాఠం చెపుతాం అని హెచ్చరించారు. రైతులకు బి ఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు మద్దతు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News