Wednesday, January 22, 2025

హరితహారం మొక్కలు అభాసుపాలు

- Advertisement -
- Advertisement -

శ్రీరంగాపురం : హరిత తెలంగాణ లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన రోడ్డు వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేసింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు రైతులు నిప్పు పెడుతుండడంతో హరితహారం లక్షం నీరు గారుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మండల పరిధిలోని షేర్‌పల్లె గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్‌కు రైతులు నిప్పు పెట్టడంతో మొక్కలు పూర్తిగా కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో గ్రామీణ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో హరితహారం లక్షం అబాసుపాలవుతుందని, హరితహారం లక్షం నెరవేరాలంటే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మొక్కలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News