Wednesday, January 8, 2025

బీహార్‌లో పోలీసు వాహనం దగ్ధం చేసిన రైతులు

- Advertisement -
- Advertisement -

పాట్నా: థర్మల్ పవర్ కంపెనీకి వ్యతిరేకంగా గత 85 రోజులుఆ ఆందోళన చేస్తున్న రైతులు మంగళవారం రాత్రి తమ ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో వారిపై పోలీసులు దాడులకు పాల్పడడంతో ఇందుకు నిరసనగా బీహార్‌లోని బుక్సర్ జిల్లాలో రైతులు బుధవారం ఒక పోలీసు వ్యానుకు నిప్పుపెట్టడంతోపాటు ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. చౌసా సబ్ డివిజన్‌లోని బనాపూర్ గ్రామంలో ఈ విధంసం చోటు చేసుకుంది. మంగళవారం థర్మల్ పవర్ ప్రాంట్ సేకరించిన తమ భూములకు తగిన నష్టపరిహారం అందచేయాలని డిమాండు చేస్తూ కొందరు రైతులు కంపెనీ కార్యాలయం ప్రధాన గేటుకు తాళం వేసి ఆందోళన చేశారు. రాత్రి రైతులు తమ ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో పోలీసులు చొరబడి లాఠీలతో కొట్టారని, ఇళ్లలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని రైతులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News