Thursday, January 23, 2025

రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి : అర్వింద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులు పుట్టెడు దు:ఖంతో ఉన్నారని, పంట నష్టంపై చర్యలేవని ప్రభుత్వాన్ని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలనను గాలికొదిలేసి మహారాష్ట్రలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. దేశంలో అత్యంత అసమర్థ ప్రభుత్వం ఇదేనని విమర్శించారు. పంట నష్టంపై నివేదికలు తెప్పించుకుని రాష్ట్రంలో రైతులను ఆదుకోవాలని గవర్నర్‌ను కోరుతున్నామని చెప్పారు.

ఎకరానికి రూ.10వేలు ఇస్తామన్నారని, కానీ తాము మాత్రం రూ.50వేలు డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. తామేదో గుడ్డిగా డిమాండ్ చేయడం లేదని, తమ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టే అడుగుతున్నామని చెప్పారు. మధ్యప్రదేశ్ రూ.32వేలు, మహారాష్ట్ర రూ.9వేలు, హర్యానా రూ. 10వేలు ఇస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇక్కడ ప్రీమియం కట్టకపోవడంతో ఫసల్ భీమా యోజన ఆగిపోయిందన్నారు. వాతావరణ శాఖ ముందు నుంచే హెచ్చరిస్తున్నా.. రాష్ట్రంలో పాలన కరువైందని అన్నారు. కనీసం విపత్తు నిధులు ఇవ్వడం లేదని, అందులో 75 శాతం కేంద్రం ఇచ్చిన నిధులే అని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News