Monday, December 23, 2024

రైతులు సేంద్రియ పద్దతిపై దృష్టిసారించాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట :  రైతులు సేంద్రియ పద్దతుల ద్వారా వ్యవసాయంపై దృష్టిసారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నాగారం మండల కేంద్రంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ భూములన్ని బీడులుగా ఉండేవని నేడు కెసిఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం అయినాయని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తర్వాత రైతులకు ప్రభుత్వం విద్యుత్ మార్కెటింగ్ వ్యవస్థను ముందు ఉంచాయని ఇవే నేడు దేశానికి తెలంగాణ దిక్సూచిలా మారాయని సూచించారు. ప్రకృతి వైపరిత్యాల నుంచి రైతు తన పంటను కాపాడుకోవడానికి సిఎం కెసిఆర్ పంటలను ముందుగా వేసుకోవాలని నిర్ణియించారని పేర్కొన్నారు.

రైతులందరూ దీన్ని సద్వినియోగం చే సుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిషోర్‌కుమార్, గుంటకండ్ల రామచంద్ర రెడ్డి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, నీటిపారుదల అధికారి రమేష్ బాబు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్టినేటర్ గుండగాని అంబయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News