Thursday, January 23, 2025

సబ్సిడీ విత్తనాలతో రైతులు అధిక దిగుబడి పొందాలి

- Advertisement -
- Advertisement -

సదాశివపేట రూరల్: రైతులు ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు, పనిముట్లను వినియోగించుకొని పంటల సాగులో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ చేనేత కార్పోరేషన్ సంస్థ చైర్మెన్ చింత ప్రభాకర్ అన్నారు. మంగళవారం సదాశివపేట మండల పరిథిలోని నందికందిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మెన్ మనోహర్‌రెడ్డి అధ్యక్షతన చింత ప్రభాకర్ రైతులకు జనుము విత్తనాలు పంపిణీ చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభు త్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని, సిఎం కెసిఆర్ రైతులకు ఎక్కడ లేని వి ధంగా రైతు బంధు, రైతు భీమా పథకాలు, సబ్సిడీ విత్తనాలు అందజేస్తున్నారన్నారు.

రైతులు ప్రభుత్వం అందించే పథకాలు వినియోగించుకొని ఆర్థికంగా ముందుండాలన్నారు. వ్యవసాయ రంగానికి సిఎం పెద్దపీట వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యాదమ్మ, నందికంది సర్పంచ్ కుందెన రాజు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సదాశివపేట సొసైటీ చైర్మెన్ రత్నాకర్‌రెడ్డి, నాయకులు సుధాకర్, శ్రీనివాస్, సిద్దన్న తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News