Monday, December 23, 2024

రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందాలి

- Advertisement -
- Advertisement -
  • సివిల్ జడ్జి హనుమంతరావు

సదాశివపేట రూరల్: అప్పుల పాలైన రైతులు తమ గ్రామాల్లోని బ్యాంకుల్లో రుణాలకు దరఖాస్తులు చేసుకొని బ్యాంకుల నుంచి రుణాలు పొందాలని, ప్రైవేటు అప్పలకు బలికావద్దని సీనియర్ సివిల్ జడ్జి హనుమంతరావు అన్నారు. గురువారం సదాశివపేట మండల పరిథిలోని కొల్కూర్ గ్రామంలో రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రయివేట్ అప్పుల బాధతో హో కోర్టు అదేశాల మరకు బ్యాంకు రుణాల మంజూరీపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి హనుమంతరావు మాట్లాడుతూ రైతులు తీసుకున్న అప్పులలు బ్యాంకుల్లో సకాలంలో చెల్లించి రుణాలు పొందాలన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం రైతులకు బ్యాంకులు రుణాలివ్వాలని చెప్పారు.

బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వకుంటే న్యాయసేవాధికార సంస్థను సంప్రదిస్తే రైతులకు న్యాయం చేస్తామన్నారు. తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ బ్యాంకర్లు రైతులకు రుణాలు మంజూరు చేసి అండగా నిలవాలని కోరారు. ప్రైవేటు అప్పుల జోలికి రైతులు పోవద్దని, బ్యాంకుల నుంచి రుణాలు పొంది పంటలకు పెట్టుబడి పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కొల్కూర్ సర్పంచ్ భూపాల్‌రెడ్డి, మంజీర రైతు సమాఖ్య అధ్యక్షుడు పృథ్వీరాజ్, నిజాంపూర్ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఎఓ అనిత, ఎస్‌బిఐ బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్, విష్ణువర్దన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News