Monday, December 23, 2024

కాలానుకూలంగా రైతులు పంటలు వేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: కాలానుగుణంగా రైతులు పంటలు వేసుకోవాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. రామన్న పేట మండల ఎన్నారం గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహనా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుతో రైతులను ఆర్థికంగా అభివృధ్ది చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టారని అన్నారు.

రైతులు మూసపద్దతిలో ఒకే పంట కాకుండా కాలానికి అనుగుణంగా, మారుతున్నవాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శ్రమ తక్కువగా ఉండి అదాయానిచ్చే పంటలవైపు రైతులు అడుగులు వేయాలని, అప్పుడే రైతులు ఆర్థికంగా అభివృధ్ది చెందుతారని అన్నారు. అలాంటివాటిలో ముఖ్యమైన పంట ఆయిల్‌ఫామ్‌సాగు తక్కువగా ఉంటుందని, అదేవిదంగా కూలీ అవసరం లేకుండా , చీడపీడల బెడద ఉండదని, పండించిన పంట దళారీ వ్యవస్థ ఉండదని తెలిపారు.

ఆయిల్ ఫెడ్ సంస్థనే కొనుగోలు చేస్తుందని ,దీంతోపాటు పంటను ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళ్లడానికి రవాణా ఖర్చులు కూడా ఇవ్వడం జరిగిందని , రైతులందరూ ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పంటపై ఎలాంటి అపోహలకు గురి కావద్దని ,సిబ్బంది అందుబాటులో ఉంటూ పంట సాగులో తగిన సలహాలు సూచనలు ఇస్తుంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మెట్టు మహేందర్‌రెడ్డి, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు ఉదయ్‌రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, ఏనుగు వెంకట్‌రెడ్డి, ఉధ్యాన అధికారి కె.కవిత, ఆయిల్ ఫెడ్ జిల్లా కోఆర్డినేటర్ ఏ. ప్రవీణ్, మండల వ్యవసాయ అధికారి బి.యాదగిరిరావు, ఎం.శ్రీనివాస్, అయిల్ ఫెడ్ ఆఫీసర్ వై ,ప్రశాంత్, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News