Friday, November 22, 2024

ఎన్‌హెచ్‌బి పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

కట్టంగూర్ : జాతీయ ఉద్యాన సంస్థ(ఎన్‌హెచ్‌బి) పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాతీయ ఉద్యాన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ రవికాంత్ సింగ్ అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని గంగదేవిగూడెం ఎఫ్‌పిఓ లో ఉద్యాన , పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఉద్యాన పంటల సంస్థ పథకాలు, పామాయిల్ సాగు యాజమాన్య,కూరగాయలు, పండ్లు పండించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు నిర్వహించిన అవగాహన , శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

జాతీయ ఉద్యాన సంస్థ లో రైతులకు మేలు జరిగే పథకాలు చాలా ఉన్నాయని, వీటిని రైతులు బ్యాంకు ద్వారా లోన్ పొంది ఆ దరఖాస్తును ఎన్‌హెచ్‌బి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ తర్వాత 40 50 శాతం వరకు ఎన్‌హెచ్‌బి ద్వారా పొందవచ్చునని తెలిపారు. అనంతరం నల్లగొండ ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి జి. సంగీతలక్ష్మీ మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగు కోసం ఒక్కో ఎకరానికి రూ.4200 / ల చొప్పున గరిష్టంగా 12.20 ఎకరాలకు ఫామాయిల్ వేసుకునే అవకాశం ఉందని మరియు డ్రిప్పు కోసం ఎస్సీ, ఎస్టీ లకు వంద శాతం, బిసీలకు 90 శాతం, ఓసిలకు 80 శాతం రాయితీ పొందవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా నెటాఫిమ్ కంపెనీ దక్షిణ భారతదేశం అగ్రోనామిస్ట్ సుబ్బారావు రైతులు సాగు చేసే పండ్లు, కూరగాయల తోటలకు డ్రిప్ వాడే విధానం గురించి తెలియజేశారు.

అదేవిధంగా ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కల్పించారు. అంతే కాకుండా వర్షాకాలంలో రైతులు వేసుకోవాల్సిన పంటలపైన నకిరేకల్ క్లస్టర్ ఉద్యాన అధికారి రావుల విద్యాసాగర్ రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఉద్యాన ,పట్టు పరిశ్రమ అధికారి జి. సంగీతలక్ష్మీ, నల్లగొండ జిల్లా నాబార్డు డిడిఎం ఎం. వినయ్ కుమార్, కట్టంగూర్ ఎఫ్‌పిఓ ఛైర్మన్ చౌగోని సైదమ్మ, నల్లగొండ మాజీ శాసన సభ్యులు మరియు కట్టంగూర్ ఎఫ్‌పిఓ సలహాదారులు నంద్యాల నర్సింహ్మరెడ్డి, నకిరేకల్, కట్టంగూర్ ఎఫ్‌పిఓ ప్రమోటర్స్, ఐఆర్‌డిఎస్ ఛైర్మన్ వి. రమేష్ మరియు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News