Thursday, November 14, 2024

జూరాల ఆగ్రో చిత్రాలు.. విత్తనాల కంపెనీ వద్ద రైతుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

నారాయణపేట: జిల్లాలో మరికల్ మండలం లో చిత్తనూరు వద్ద నిర్మించిన జూరాల ఆగ్రో చిత్రాలు ఇత్నాలు కంపెనీకి వ్యతిరేకంగా ఉధృతం అవుతున్న రైతుల ఆందోళన. ఎక్లస్ పూర్, చిత్తనూర్, రాంపురం, జిన్నారం,నంకాల నర్వ లంకెడిదొడ్డి, జంగం రెడ్డిపల్లి ,కన్మనూరు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున కంపెనీ వద్దకు చేరుకొని ధర్నా దిగారు. పోలీసులు పెద్ద ఎత్తున రైతుల ధర్నా వద్దకు చేరుకున్నారు. కంపెనీ దాదాపు 500 ఎకరాల్లో ఏర్పాటు చేశారని ఈ కంపెనీ వలన దాదాపు 30 గ్రామాల ప్రజలకు కాలుష్యంతో పాటు నీటి కాలుష్యం కూడా జరుగుతోందని రైతుల ఆరోపిస్తున్నారు.

అంతే కాకుండా కోయిల్ సాగర్ మెయిన్ కాలవ నుండి ఒక టీఎంసీని అక్రమంగా ఈ పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేకుండా తరలించకపోవడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కంపెనీ ఏర్పాటుకు ఎలాంటి డిపిఆర్ లేకున్నప్పటికీ ప్రభుత్వ దృష్టికి తీసుకు రాకుండా ఇక్కడి ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై కంపెనీకి వత్తాసు పలికి అనుమతులు ఇచ్చారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. కంపెనీని ఇక్కడ నుంచి ఎత్తివేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News