Thursday, January 23, 2025

నిజామాబాద్ ఎంపి అరవింద్ కు రైతుల సెగ

- Advertisement -
- Advertisement -

Farmers strike before BJP MP Aravind house

నిజామాబాద్: బిజెపి ఎంపి అరవింద్ ఇంటిని రైతులు చుట్టుముట్టారు. పెర్కిట్ లోని అరవింద్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నిజామాబాద్ ఎంపి అరవింద్ కు రైతుల సెగ తాకడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అరవింద్ ఇంటి ముందు రైతులు వరి ధాన్యాన్ని కుప్పగా పోసి నిరసన తెలిపారు. కేంద్రం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు నినాదాలు చేశారు. జిల్లా నలుమూలలనుండి రైతులు అక్కడికి చేరుకోవడం తో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎంపిగా గెలిచిన రోజు నుంచి రైతు వ్యతిరేకి అయిన అరవింద్ రైతులతో ఏదో ఒక వివాదం లో చిక్కుకుంటున్నాడు. జిల్లా కేంద్రంలో ఎక్కడ పర్యటించిన రైతులు అరవింద్ ను అడ్డుకుంటున్నారు. మొన్న ఆర్మూర్ రైతులైతే ఏకంగా గ్రామాలనుండి ఉరికించి పరుగులు పెట్టించారు. గ్రామ పర్యటనలు మానుకొని ఢిల్లీ కేంద్రంగా రాజకీయం చేస్తున్న అరవింద్ కు ఆర్మూర్ పట్టణములో తన నివాసం లో ఇంకో జలక్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News