Wednesday, November 6, 2024

సాగునీటి కోసం రైతుల ధర్నా..

- Advertisement -
- Advertisement -

గంగాధర: నారాయణపూర్ రిజర్వాయర్ నుండి పంట పొలాలలకు సాగునీరు తక్షణమే విడుదల చేయాలని చొప్పదండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. రెండు నెలలుగా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా అధికార యంత్రాంగంలో చలనం లేదన్నారు. యాసంగి సాగు ప్రారంభానికి ముందే రిజర్వాయర్ గండి పూడ్చివేత పనులు చేపట్టాలని డిమాండ్ చేసిన అధికార యంత్రాంగం పట్టించుకోలేదన్నారు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో రిజర్వాయర్ కింద వందలాది ఎకరాల వరి పంట ఎండిపోతుందన్నారు. గంగాధర మండలం కొండాయిపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పొలాలను రైతులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.

ఇప్పటికే వేలాది రూపాయలు అప్పులు తీసుకొచ్చి రైతులు వరి పంట సాగు చేస్తే అధికారులు సకాలంలో సాగునీరు విడుదల చేయకపోవడంతో పంట ఎండిపోతుందన్నారు. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సాగునీరు విడుదల చేయాలని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో సాగునీరు విడుదల చేయకపోతే వందలాది మంది రైతులతోకలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, కాంగ్రెస్ మండల కిసాన్ అధ్యక్షుడు బూర్గు గంగయ్య, కాంగ్రెస్‌పార్టీ నాయకులు తోట కరుణాకర్, జాగిరపు శ్రీనివాస్‌రెడ్డి, కోల ప్రభాకర్, పెద్దిల్లి రాజేశం, గ్రామ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News