Monday, December 23, 2024

కరెంటు కోతలపై రోడ్డెక్కిన రైతులు

- Advertisement -
- Advertisement -

కోహెడ : కరెంటు కోతలపై సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామానికి చెందిన రైతులు కన్నెర జేస్తూ… కోహెడ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి బుధవారం నిరసన వ్యక్తం చేశారు. రైతులకు చేస్తున్న నిరసనకు తీగలకుంటపల్లి సర్పంచ్ మ్యాకల చంద్రశేఖర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశంలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఇష్టానుసారంగా కరెంటు కోతలు విధించడంతో రైతుల పంటలు ఎండిపోయే స్థితికి చేరాయన్నారు. బిఆర్‌ఎస్ నాయకులు నోరు తెరిస్తే చాలు 24 గంటల కరెంటు ఇస్తున్నామని ప్రగాల్భాలు పలుకుతారని, ఇప్పుడు రైతులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సిద్దిపేట నియోజవకర్గంలోని మండలాల్లో కరెంటు కోతలు విధించకపోవడం, కేవలం ఒక్క కోహెడ మండలంలోనే కరెంటు కోతలు విధించడంలో ఆంతర్యం ఏమిటన్నారు.

రైతులు మాట్లాడుతూ… కరెంటు కోతలపై తాము పడుతున్న కష్టాలను అన్నీకావనీ తమను పట్టించుకునే వారే లేరంటూ మండిపడ్డారు. కరెంటు కోతలపై ఎఇని రైతులు నిలదీశారు. ఎఇ స్పందించి… ఈ ఆదివారం వరకు కొంత ఇబ్బంది ఉంటుందని రైతులు సహకరించాలని, సోమవారం నుండి కోతలు విధించకుండా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పడంతో రైతులు దర్నా విరమించారు. ప్యాక్స్ డైరెక్టర్ మ్యాకల సురేందర్ రెడ్డి, నాయకులు గుగ్గిళ్ల శ్రీనివాస్, బండ జగన్ యాదవ్, పులగుర్ల రాజిరెడ్డి, మెతుకు శేకర్ రెడ్డి, ప్రశాంత రెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News