Monday, November 18, 2024

రైతులు ఆందోళన చెందవద్దు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల ః రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేఫథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలిపారు. దుర దృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని కోరారు. రాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటిఆర్ తెలిపారు.

ఈ మధ్యనే కురిసిన అకాల వర్షాల నేఫథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వం రాష్ట్రంలో ఉందన్న కెటిఆర్, రైతులు ధైర్యం కోల్పోవద్దని, రైతులకు అండగా కెసిఆర్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కెటిఆర్ అన్నారు. రానున్న ఒకటి, రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్న నేఫథ్యంలో రాష్ట్రంలోని అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అధికార యంత్రానికి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News