- Advertisement -
న్యూఢిల్లీ: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారంతో మరోసారి స్పష్టమైంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. దేశంలో రైతుల మరణాలపై రాజ్యసభలో సభ్యుడు నారాయణ్ దాస్‌గుప్తా అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
అందులో భాగంగా తెలంగాణలో 2017లో 846 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా..2021 నాటికి వాటి సంఖ్య 352కు తగ్గిందని తన సమాధానంలో వివరించారు. నాలుగేళ్ల వ్యవధిలో సుమారు 500 మంది రైతు ఆత్మహత్యలు నివారించగలిగనట్టు కేంద్రం గణాంకాలతో రుజువైంది.
- Advertisement -