Wednesday, January 22, 2025

ప్రకృతి విపత్తులను పట్టించుకోని కేంద్రం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రకృతి విపత్తులతో యాసంగి రైతులు చిత్తవుతున్నారు. వర్షాలు వడగండ్ల వానలతో ల క్షలాది ఎకరాల్లో వివిధ రకాల పైర్లు దెబ్బతిన్నా యి. ఉద్యాన పంటలపై రైతులు పెట్టుకున్న ఆశలన్ని నేలరాలాయి. తెలంగాణ రైతులు పంటపొలాల వద్ద కళ్లముందు కనిపిస్తున్న పంట న ష్టాలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ప్ర కృతి వైపరిత్యాలు ఇంత పెద్దస్థాయిలో చోటుచేసుకున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ వైపు కన్నెత్తయినా చూడటంలేదు..రాష్ట్రాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దేశ ఆహార భ ద్రత వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉందని పదే పదే ప్రకటనలు చేసే ప్రధాని మోడీ నుంచి ప్రకృతి విపత్తులతో విలవిల్లాడుతున్న తెలంగా ణ రాష్ట్ర రైతులపట్ల కనీస ఓదార్పు కుడా కరువయింది.

అకాల వర్షాలు వడగండ్ల వానలు, ఈ దురు గాలులతో వ్యవసాయరంగం చిన్నాభిన్నమైనా కనీసం ఇందుకు సంబంధించిన నామమాత్రపు పరామర్శకూడా చేసిన దాఖలాలు లే వు. ప్రకృతి విపత్తులను జాతీయ విపత్తులుగా ప రిగణించి బాధిత వర్గాలకు అండగా నిలిచి సా యం అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం కనీసం ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందన్నది కూ డా మరిచిపోయినట్టు నటిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా 10 లక్షల ఎకరాల్లో పంట లు దెబ్బతిన్నట్టు ప్రాథమిక సమాచారం. అయి తే పంట నష్టం ఎంత అన్నది క్షేత్ర స్థాయి తనిఖీల ద్వారా అంచనా రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ, ఉద్యా న, రెవెన్యూ శాఖల అధికారులతో క్లస్టర్ల వారీగా సర్వేలు చేయిస్తోంది.

వాతావరణ మార్పులు, అ కాల వర్షాలకు సంబంధించి ముందస్తు సమాచారంతో రైతును ఎప్పటికప్పుడు అప్రమత్తం చే స్తూ పంట నష్టాలు తగ్గించేందుకు ముఖ్యమం త్రి కేసిఆర్ అధికార యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. శాఖలకు చెందిన రాష్ట్ర మంత్రులు అధికార బృందాలను వెంటబెట్టుకు ని జిల్లాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. పం ట పొలాల వద్దకే వెళ్లి దెబ్బతిన్న పైర్లను పరిశీలించి జరిగిన నష్టాలపై నివేదికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రైతులకు ధైర్యం చెబుతున్నారు.
కేంద్రం సాయమేది?
తెలంగాణలో అకాల వర్షాలు వడగండ్ల వానల కు దెబ్బతిన్న యాసంగి పైర్లకు సంబంధించిన నష్టాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే రైతులు, రైతుసంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో పంటలు నష్టపోయిన రైతుల నుంచి వస్తున్న రోదనలు ఢీల్లీ చెవికెక్కటం లేదు. కేంద్రంలోని విపత్తుల నిర్వహణ, వ్యవసాయ, ఉద్యాన శాఖలకు చెందిన అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర పర్యటనకు పంపుతున్నట్టు ప్రధాని నరేంద్రమోడి కార్యాలయం నుంచి ఇంతవరకూ కనీస సమాచారం కూడా రాష్ట్రానికి అందలేదు.

ప్రకృతి వైపరిత్యాల కారణంగా వ్యసాయరంగంలో పంటలు దెబ్బతిన్న ప్రతిసారి రాష్ట్ర అధికారులే పొలాల వెంట తిరిగి పంటనష్టాల అంచనాలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపటమే తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి పైసా విదిల్చింది లేదంటున్నారు. కేంద్రం ఆలస్యంగా స్పందించి కేంద్ర బృందాలను తీరుబడికా రాష్ట్రాలకు పంపితే అప్పటికి పంట నష్టాల ఆనవాళ్లు చెదిరి పోయాక చేసేదేమి ఉండదటున్నారు. 2019,2020,2021లో వచ్చిన భారీ వరదలకు రాష్ట్ర పెద్ద మొత్తంలో నష్టపోయింది. దేశంలోని కర్నాటక, అస్సాం ,మేఘాలయ , నాగాలాండ్ రాష్ట్రాలకు వరద సాయం అందించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పైసా కూడా విదల్చలేదు.

గో దావరి వరదల్లో 1400కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి నివేదించినా, ఇప్పటివరకూ స్పందన లేదు. కనీసం ఈ సారి కూడా పంటలు నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి సాయం అందుతుందన్న ఆశ తప్ప.. నమ్మకం మాత్రం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News