Friday, April 4, 2025

ఎన్టీఆర్‌నగర్ కూరగాయల మార్కెట్‌లో రైతులకు సత్కారం

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : దశాబ్ద కాలంలో దేశంలో రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందించందని ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌నగర్ కూరగాయల మార్కెట్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ది దినోత్సవ వేడుకల్లో రైతులకు శనివారం కార్యక్రమానికి ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ ముఖ్యాతిథిగా హాజరై రైతులకు సత్కారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలంలో వ్యవసాయ రంగంలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని ,2014.2015 వరి ఉత్పత్తిలో దేశంలో 15వ స్థ్దానంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు అగ్రస్థ్దానానికి చేరుకుందని తెలిపారు. ఉత్పాదకతలో రెండో స్థ్దానంలో నిలిచిందని గుర్తు చేశారు.

సీఎం కేసిఆర్ పాలనకు నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి దయానంద్ గుప్తా, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్ , సాగర్‌రెడ్డి, ఈశ్వరమ్మయాదవ్, మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెటీ సభ్యులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News