Monday, December 23, 2024

రైతు సంక్షేమమే సిఎం కెసిఆర్ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

వైరా : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని,రైతుల పక్షపాతి సిఎం కెసిఆర్ అని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం వైరాలో దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఊరూరా చెరువు సంబరాల వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్మించి దేశంలోనే ఆదర్శంగా సిఎం కెసిఆర్ నిలిచారన్నారు. గత ప్రభుత్వాల కాలంలో చెరువులలో నీరు లేక అల్లాడిపోయే పరిస్థితి ఉండేదని కాని నేడు ఆ పరిస్థితి లేక చెరువులన్నీ నిటితో కళకళ లాడుతున్నాయన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల చెరువుల పూడిక తీయించి రైతులను ఆదుకున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని అన్నారు. రూ.30 వేల కోట్లతో చెరువులను ఆధునీకరించి రైతుల కళ్లలో ఆనందం నింపుతున్నారన్నారు. అంతేకాకుండా రైతులు పండించిన ధాన్యానికి గిట్టుభాటు ధర కల్పించి రైతులను ఆదుకుంటున్నారని అన్నారు. ప్రజలందరూ ఒకదెగ్గరకు చెరుకోని భోజనాలు చేయటం ఎంతో సంతోషకరమన్నారు. అనంతరం ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ఎండాకాలంలో కూడా చెరువులలో నీరు మత్తడి దూకుతున్నాయని అందుకు సిఎం కెసిఆర్ చెపట్టిన చెరువులలో పూడికల వలననే అన్నారు.

ఒకప్పుడు వైరాలో పంట పొలాలకు నిరందించాలని రైతులు దర్నాలు చేసేవారని ఇప్పుడు ఆ పరిప్థితి లేదని అందుకు కారణం సిఎం కెసిఆర్ చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలే కారణమన్నారు. త్వరలో సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మరిన్ని గ్రామాలో సస్యశ్యామల అవుతాయని అన్నారు. అంతేకాకుండా చేపలు కొనాలంటే ఒకప్పుడు ఆంధ్రా నుంచి వచ్చేవని కాని నేడు వైరా రిజర్వాయర్ నుంచి చేపలు దిగుమతి చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని అన్నారు.

తొయిత వైరా రిజర్వాయర్‌కు మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ మధు, ఎమ్మెల్యే రాములు నాయక్, కలెక్టర్ పివి.గౌతమ్, అడిషనల్ కలెక్టర్ స్నేహలత బతుకమ్మలకు పూజలు చేసి బతుకమ్మలను రిజర్వాయర్‌లోకి వదిలారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మకు పూజలు చేశారు. అనంతరం రిజర్వాయర్ వద్ద భారీగా ప్రజలు వచ్చి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో అనంతరం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, వివిధ శాఖల అధికారులు, బిఆర్‌ఎస్ నాయకులు రత్నం, బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవి, పసుపులేటి మోహన్‌రావు, పావని, నంబూరి కనకదుర్గ, డాక్టర్ కొటయ్య, డాక్టర్ కాపా మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News