Monday, December 23, 2024

రైతు సంక్షేమమే కెసిఆర్ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: రైతు సంక్షేమమే కెసిఆర్ ధ్యేయం అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం నార్కెట్‌పల్లిలో గల ఆయన క్యాంపు కార్యాలయంలో ఉదయసముద్రం ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోతున్న రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉదయసముద్రం ప్రాజెక్టు పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో రైతుల భూములు కాలువకి ంద పోవడం బాధాకరమని, అయినప్పటికీ, మీకు సంపూర్ణ న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామి ఇచ్చారు.

మీకుఅందే నష్టపరిహారం త్వరితగతిన అందజేసి, సహకారం అందిస్తామని అన్నారు. రైతులు పెద్ద మనసుతో ప్రభుత్వం చేసే అభివృధ్దిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులతో ముచ్చటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమ ంలో ఎంపిపి సూదిరెడ్డి నరేందర్‌రెడ్డితో పాటు మండలంలోని అధికారులు, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News