Saturday, December 21, 2024

రైతు సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం

- Advertisement -
- Advertisement -

మరిపెడ : రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, బిఆర్‌ఎస్‌ది రైతు ప్రభుత్వమని, రైతులు సుభిక్షంగా ఉండాలనే సిఎం కెసిఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్యే రెడ్యానాయక్ చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామంలోని తన స్వగృహంలో లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి నెలలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి నియోజకవర్గ స్ధాయిలో 1761 మంది రైతులకు గానూ రూ. 1. 65 కోట్లను మంజూరు చేసి సిఎం కెసిఆర్ రైతులకు అండగా నిలిచారని తెలిపారు. దంతాలపల్లి మండలంలో 1042 మంది రైతులకు రూ. 99. 43 లక్షలు, మరిపెడ మండలంలో 88 మంది రైతులకు రూ. 5. 39 లక్షలు, చిన్నగూడూరు మండలంలో 11 మంది రైతులకు రూ. 56250, కురవి మండలంలో 158 మంది రైతులకు 9. 95 లక్షలు, డోర్నకల్ మండలంలో 80 మంది రైతులకు రూ. 7. 82 లక్షలు, నర్సింహులపేట మండలంలో 382 మంది రైతులకు రూ. 43. 29 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మరిపెడ ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు సింధూర రవినాయక్, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు తాళ్లపెల్లి రఘు, నీలికుర్తి సర్పంచ్ గుడిపుడి శ్రీనివాసరావు, నర్సింహులపేట మండల నాయకులు యాదగిరిరెడ్డి, దేవేందర్, ఏడిఏ శోభన్‌బాబు, వ్యవసాయ అధికారులు వీరాసింగ్, మంజూఖాన్, జావీద్, మురళిమోహన్, వ్యవసాయ విస్తరణ అధికారులు రామకృష్ణ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News