Wednesday, January 22, 2025

కాంగ్రెస్ పార్టీని బొందపెడితేనే రైతన్నలకు మేలు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: తెలంగాణ రైతాంగానికి బేషరతుగా రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ శాసనభ్యులు రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం కొండమల్లేపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ… రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దే తెలంగాణాలో ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచనలో కాంగ్రెస్ పార్టీది అని ఆయన అన్నారు. రైతులతో పెట్టుకున్న వాళ్లకు డిపాజిట్లు కూడా రావు.

రైతులను వ్యతిరేకించే కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సాగు, నీరు, నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలోనే రైతులు మంచి పంటలు ప ండిస్తూ సుఖ సంతోషాలతో ఉన్నారని, స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్న రాబందులు కాంగ్రెస్, బీజేపీలను బొందపెడదాం అని ఆయన అన్నారు. 24గంటలు కరెంటు ఇచ్చి సాగును సీఎం కేసీఆర్ పండుగగా మా ర్చితే.. ఈ కాంగ్రెసోళ్లు రైతుల పొట్ట కొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే కటిక చీకటి అని ఆయన తెలిపారు. రైతులకు 3 గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ పార్టీని బొందపెడదాం… కేసీఆర్ రైతు రా జ్యాన్ని కొనసాగిద్దాం.. అని ఆయన పిలుపునిచ్చారు. 24గంటల కరెంటు రద్దు చేసి మూడు గంటల కరెంటు మాత్రమే ఇస్తానని చెప్పడం కాంగ్రెస్ దుష్ట విధానాలకు పరాకాష్ట అన్నారు. కాంగ్రెస్ కాలంలో కరువులు, కన్నీళ్లు, కటిక చీకట్లు, అప్పులు, ఆత్మహత్యలతో అన్నదాతలు అరిగోస పడ్డారన్నారు. కరెంటు రాకడ.. ప్రాణం పో కడ.. చాలీ చాలని 3 గంటల నాసిరకం కరెంటుతో రైతులు నరకం అనుభవించారన్నారు.

కాంగ్రెస్ కల్తీ పాలనలో రైతులకు దొరికింది కల్లీ విత్తనాలు.. కల్తీ పురుగు మందులే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతాంగాన్ని రక్షించుకోవడానికి వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటపడేయడానికి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభు త్వం ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన తెలిపారు. ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసి మోటార్లుకు మీటర్లు పెట్టాలని రాష్ట్రం మెడపైన కత్తిపెట్టినా ప్రభు త్వం లొంగిపోలేదన్న 24 గంటల ఉచిత కరెంటును కాపాడుకోవడం కోసం ఏకంగా 30 వేల కోట్ల రూపాయలను వదులుకున్నది తప్ప రైతుల ప్రయోజనాలపై రాజీపడబోమన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థితికి ఎదిగిన తెలంగాణ అన్నదాతను చూసి కాంగ్రెస్ పార్టీకి కళ్లు మండుతున్నాయని మండిపడ్డారు.

రాష్ట్ర సర్కార్ వ్యవసాయానికి అందిస్తున్న 24 గం టల ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని, 3 గం టలు వద్దు, 3 పంటలు కావాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రైతుల హర్షధ్వానాల మధ్య ఆమోదించారు. రైతుబం ధు అధ్యక్షు డు కేసాని లింగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగేందర్‌రెడ్డి, బీఆర్‌ఎవ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ దాస్రు నాయక్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, బీఆర్‌ఎస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు నేనావత్ రా ంబాబు నాయక్, రమావత్ తులసిరామ్, మాడ్గుల యాదగిరి, నేనావత్ శంకర్ నాయక్, నేనావత్ బలరాం, మధు నాయక్, బొడ్డుపల్లి కృష్ణ, హరికృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News