Monday, January 20, 2025

కాంగ్రెస్ తోకలు కత్తిరిస్తారు!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసేలా రైతుబంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా ఎండగట్టాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వ హించారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరిపైన వెంటనే ప్రతి నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రం, ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేయాలన్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దగ్ధంతోపాటు ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మంత్రులు, ఎంఎల్‌ఎ అభ్యర్థులు, పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి కాంగ్రెస్ తీరును ఎం డగట్లాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ రై తుబంధు ఆపాలంటూ ఎలక్షన్ కమిషన్ పిర్యాదు చేసి, రైతులను ఆగం చేసేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న ఈ కార్యక్రమా న్ని కేవలం అక్కసుతో ఆపాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ఇప్పటికే 11సార్లు పంట సీజన్లకు అనుగుణంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. కానీ కాంగ్రెస్ ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతులకు సహాయం ఆపాలని ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఇలా కోడ్ పేరు చెప్పి ప్రభుత్వం అందిస్తున్న ఇంటింటికి మంచినీళ్లు, ఇరవై నాలుగు గంటల కరెంటును ఆపెయ్యమంటరా అని ప్రశ్నించారు. మరీ అన్ని సంక్షేమ పథకాల్లో కూడా కెసిఆరే కనిపిస్తడు కదా? దీంతో అన్ని పథకాలను కాంగ్రెస్ ఆపాలంటుందా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందని, అన్న దాతల పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అన్నారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్‌పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహిం చరని హెచ్చరించారు. అన్నదాతల పొట్టకొట్టే కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరన్నారు. రైతు బంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలను ప్రజలు కట్ చేయడం పక్కా అన్నారు. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరన్నారు. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెరదీశారన్నారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసేలా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News