Sunday, January 19, 2025

చట్టబద్ధతతోనే రైతులకు మేలు

- Advertisement -
- Advertisement -

కనీస మద్దతు ధరపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచన

అప్పుడే జిడిపి వృద్ధికి రైతులు చోదకులు కాగలరని అభిప్రాయం
ఎంఎస్‌పిపై మోడీవన్నీ అసత్య ప్రచారాలే
ఎక్స్ వేదికగా రాహుల్ సలహా

న్యూఢిల్లీ : పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టబద్ధమైన గ్యారంటీ భారతీయ రైతులకు మేలు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీ మంగళవారం సూచించారు. అది బడ్జెట్‌పై రైతులను భారం కానివ్వదని, కాని జిడిపి వృద్ధికి వారిని చోదకులను చేసేలా చూస్తుందని రాహుల్ సలహా ఇచ్చారు. ఎంఎస్‌పికి చట్టబద్ధమైన గ్యారంటీ ఇవ్వాలని కాంగ్రెస్ తీర్మానించినప్పటి నుంచి ‘మోడీ ప్రచార యం త్రాంగం, మైత్రీపూర్వక మీడియా ఎంఎస్‌పిపై అసత్యాలను వ్యాప్తి చేస్తున్నాయి’ అని రాహుల్ హిందీలో ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆరోపించారు. ‘ఎంఎస్‌పికి చట్టబద్ధమైన గ్యారంటీ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో సాధ్యం కాదనడం అబద్ధం.

క్రిసిల్ ప్రకారం, 2022-23లో రైతులకు ఎంఎస్‌పి ఇవ్వడంవల్ల ప్రభుత్వంపై రూ. 21 వేల కోట్ల అదనపు భారం పడి ఉండేదనడం సత్యం. అది మొత్తం బడ్జెట్‌లో 0.4 శాతం మాత్రమే’ అని రాహుల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. రూ.14 లక్షల కోట్ల బ్యాంకు రుణాల మాఫీ, రూ.1.8 లక్షల కోట్ల మేరకు కార్పొరేట్ పన్ను మినహాయింపు జరిగిన దేశంలో రైతులపై చేసే స్వల్ప వ్యయం వారిని ఎందుకు బాధిస్తోందని ఆయన ప్రశ్నించారు. ఎంఎస్‌పికి చట్టబద్ధమైన గ్యారంటీ ఇస్తే వ్యవసాయంపై పెట్టుబడి పెరుగుతుందని, గ్రామీణ భారతంలో డిమాండ్ అధికం అవుతుందని, వివిధ రకాల పంటల సాగులో రైతులకు నమ్మకం హెచ్చుతుందని రాహుల్ వాదించారు. ‘ఎంఎస్‌పిపై గందరగోళం సృష్టిస్తున్నవారు డాక్డర్ స్వామినాథన్‌ను, ఆయన కలలను కించపరుస్తున్నారు’ అని రాహుల్ ఆరోపించారు. స్వామినాథన్ సూత్రం ఆధారంగా రైతుల పంటలకు రేటు ఇవ్వడానికి పార్టీ తీర్మానించడం గురించి మోడీ ఒక బిజెపి కార్యక్రమంలో మాట్లాడిన వీడియో క్లిప్‌ను రాహుల్ తన పోస్ట్‌కు జత చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News