జమ్మూ కశ్మీరు: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రజలకు నేషనల్ కాన్ఫరెన్స్ చైర్మన్, జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా అభినందనలు తెఇపారు. భారత్‌లో సోదరభావం క్షీణిస్తోందని, దీన్నిపేనరుజ్జీవింప చేయాల్సిన అవసరం ఉందని శనివారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆయన అభిప్రాయపడ్డారు. అయోధ్యలో రామాలయం త్వరలో ప్రారంభానికి ముస్తాబవుతున్న వేళ ఆలయ నిర్మాణం కోసం కృషి చేసిన వారందరికీ శుభాంక్షలు తెలియచేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీరాముడు కేవలం హిందువులకు మాత్రమే చెందినవాడు కాదని, యావత్ ప్రపంచానికి చెందినవాడని కూడా ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ శ్రీరాముడు దేవుడని, ఈ విషయం గ్రంథాలలో రాసి ఉందని ఆయన అన్నారు. సోదరభావం, ్రప్రేమ, ఐక్యత, పరస్పర సాయం వంటివి శ్రీరాముడు ఇచ్చిన సందేశాలనికులమతాలకు అతీతంగా అట్టడుగు వర్గాలను ఆదుకోవాలని రాముడు యావత్ మానవాళికి సందేశం ఇచ్చాడని అబ్దుల్లా చెప్పారు. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం జరగనున్న సందర్భంగా దేశంలో క్షీణిస్తున్న సోదరభావాన్ని పునరుజ్జీవంప చేయాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సోదరభావంతో ప్రజలంతా జీవించాలని ఆయన ఆకాంక్షించారు.