Sunday, December 22, 2024

కాంగ్రెస్‌తో పొత్తు అత్యవసరం:ఫరూఖ్ అబ్దుల్లా

- Advertisement -
- Advertisement -

జమ్మూ కశ్మీరు అభివృద్ధి, కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర పత్రిపత్తి పునరుద్ధరణ కోసం కాంగ్రెస్‌తో తన పార్టీ పొత్తు కుదుర్చుకోవడం విధి లేని పరిస్థితుల్లో కాక అత్యవసరంగా భావిస్తున్నామని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీరుకు చెందిన ప్రధాన స్రవంతి నాయకులను పాకిస్తానీలు లేదా ఖలిస్తానీలు అని ముద్ర వేస్తున్న వ్యక్తులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూ కశ్మీరు పర్యటన చెంపపెట్టని కూడా ఆయన అన్నారు. దక్షిణ కశ్మీరులో రాహుల్ గాంధీ ప్రసంగించనున్న ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు తన నివాసం నుంచి బుధవారం బయల్దేరి వెళ్లే ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో తన పార్టీ పొత్తు పెట్టుకున్నది విధిలేని పరిస్థితుల్లో కాదని,

అతి జమ్మూ కశ్మీరు అభివృద్ధికి అత్యంత అవసరమని అన్నారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాన గొంతుకగా ఆయన అభివర్ణించారు. జమ్మూ శశ్మీరు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి దిగజారడం తన జీవితంలో మొదటిసారి చూస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలని, మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తి రావాలని ఆయన అన్నారు. తమ ప్రయత్నాలన్నీ అందుకోసమే ఆయన చెప్పారు. తన పారీపై పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి చేసిన ఆరోపణలపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరిస్తూ ఆమె ఏవేవో మాట్లాడుతుంటారని ఆయన అన్నారు.

ఓమర్ అబ్దుల్లా నామినేషన్
నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా బుధవారం గండెర్‌బాల్ అసెంబ్లీ స్థానం నుంచి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పర్టా సీనియర్ నాయకులు, తన కుమారులు వెంట రాగా ఆయన గండెర్‌బాల్‌లోని మినీ సచివాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇదివరకటి జమ్మూ కశ్మీరు రాష్ట్రంలో ఎన్‌సి-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2009 నుంచి 2014 వరకు ఇదే నియోజకవర్గానికి ఓమర్ అబ్దుల్లా ప్రాతినిధ్యం వహించారు. అబ్దుల్లా కుటుంబానికి కంచుకోట అయిన ఈ నియోజకవర్గానికి గతంలో ఎన్‌సి వ్యవస్థాపకుడు షేక్ ముహమ్మద్ అబ్దుల్లా, ప్రస్తుత అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా గతంలో అనేక పర్యాయాలు ప్రాతినిధ్యం వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News