Sunday, December 22, 2024

ప్రధానికి ఫరూక్ అబ్దుల్లా అభినందనలు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో కొత్త రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించించినందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీని, రైల్వే మంత్రిత్వ శాఖకు అభినందించారు.‘ ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రిత్వ శాఖ వేసిన అతిపెద్ద ముందడగు ఇది.

దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ మైలురాయిని సాధించినందుకు మేము వారిని అభినందిస్తున్నాం’ జమ్మూ డివిజన్‌లోని సంగల్దాన్, కశ్మీర్ లోయలోని బారాముల్లా మధ్య కొత్త రైళ్లకు ప్రధాని పచ్చజెండా ఊపి ప్రారంభించడంపై శ్రీనగర్ లోక్‌సభ సభ్యుడు కూడా అయిన ఫరూక్ అబ్దుల్లా అన్నారు. తరచూ జాతీయ రహదారులు మూతపడ్డంకశ్మీరీలకు పెద్ద సవాలుగా మారుతున్న నేపథ్యంలో ఈ కొత్త రైల్వే లింక్ దేశంలోని మిగతా ప్రాంతాలతో కశ్మీర్‌నుఅనుసంధానం చేస్తుందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News