Monday, December 23, 2024

నా పేరును ఉపసంహరించుకుంటున్నా: ఫారూఖ్ అబ్దుల్లా

- Advertisement -
- Advertisement -
Farooq Abdullah
తన ముందు చాలా క్రియాశీల రాజకీయాలు ఉన్నాయని చెబుతున్న ఫరూక్ అబ్దుల్లా, ప్రతిపక్ష శిబిరం నుండి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించిన రెండవ నాయకుడు.

శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ,  జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఉమ్మడి ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేయడానికి నిరాకరించారు.  “ఈ అనిశ్చిత సమయాల్లో  కశ్మీర్ ముందుకు సాగడంలో సహాయపడాల్సి ఉంది,  కేంద్ర పాలిత ప్రాంత మైన కశ్మీర్ కు  తన అవసరం ఉంది, నా ముందు చాలా క్రియాశీల రాజకీయాలు ఉన్నాయి” అని ఆయన పేర్కొన్నారు.

“భారత రాష్ట్రపతి పదవికి మమతా బెనర్జీ సాహిబా ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా నా పేరు ప్రతిపాదించినందుకు,  నేను గౌరవంగా భావిస్తున్నాను. మమతా దీదీ నా పేరును ప్రతిపాదించిన తర్వాత, నా అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తానని ప్రతిపక్ష నాయకుల నుండి నాకు చాలా కాల్స్ వచ్చాయి” అని అబ్దుల్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే కేంద్రపాలిత ప్రాంతంలో తన అవసరం ఎంతో ఉందని పేర్కొంటూ మాజీ ముఖ్యమంత్రి తన పేరును పరిశీలన నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. “జమ్మూకశ్మీర్ ఒక క్లిష్టమైన ఘట్టం గుండా వెళుతోందని నేను నమ్ముతున్నాను,  ఈ అనిశ్చిత సమయాల్లో కశ్మీర్ ముందుకు సాగడంలో  నా ప్రయత్నాలు అవసరం” అని ఆయన తన  ప్రకటనలో తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News