శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సి) పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేశారు. వచ్చే నెల ఆ పార్టీ చీఫ్ ఎన్నిక జరుగనుంది. ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షుడుగా ఉన్న ఆయన కుమారుడు ఒమర్ ఫరూఖ్ పార్టీ కొత్త చీఫ్ కావొచ్చని తెలుస్తోంది. శ్రీనగర్‌లోని పార్టీ వ్యవస్థాపకుడు షేక్ ముహమ్మద్ అబ్దుల్లా సమాధి వద్ద డిసెంబర్ 5న జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ కొత్త చీఫ్ ఎవరో నిర్ణయం కానుంది. శ్రీనగర్‌లో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఫరూఖ్ అబ్దుల్లా ప్రసంగిస్తూ “ ప్రస్తుతం నా ఆరోగ్యం సహకరించడంలేదు. అందుకని నేను పార్టీ సారథ్యం వెరొకరికి అప్పగించాలనుకుంటున్నాను” అని తెలిపారు. ఆయన వయస్సు ప్రస్తుతం 85 ఏళ్లు. ఆయన జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్(జెకెసిఏ) అక్రమాలు, మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) 2020 డిసెంబర్ 19న రూ. 11.86 కోట్లు విలువ చేసే ఆయన ఆస్తులను జప్తు చేసుకుంది. 2005 నుంచి 2011 వరకు జెకెసిఏకు రూ. 109.78 కోట్లు బిసిసిఐ నుంచి అందాయని, అందులో రూ. 45 కోట్లు స్వాహా అయ్యాయని ఈడి అంటోంది. పైగా అందులో విత్‌డ్రా చేసిన రూ.25 కోట్లు లెక్కతేలడం లేదని కూడా తెలిసింది.
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవికి ఫరూఖ్ అబ్దుల్లా రాజీనామా
- Advertisement -
- Advertisement -
- Advertisement -