Saturday, December 21, 2024

భారత్‌లో ఫాసిస్ట్ పాలన ప్రారంభం కాలేదు

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: భారత్‌లో ఫాసిస్ట్ పాలన ఇంకా ప్రారంభం కాలేదని, తమ భావాలకు అనుగుణమైన రాజ్యాన్ని స్థాపించుకునే దశలో మా త్రమే ఉందని ప్రముఖ మార్కిస్ట్ మేధావి(కేరళ) మురళీధరన్(అజిత్) అభిప్రాయం వ్యక్తం చేశారు. విప్లవ శక్తులు తమ సాహిత్య, సాంస్కృతిక రంగాలలో బలమైన పోరాటాలు చేయడం ద్వారా హిందూ భావజాలాన్ని ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేశారు. విరసం ఆవిర్భావం సందర్భంగా బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వందేళ్ల సంఘ్ పరివార్ ఫాసిజం అనే అంశంపై ఆదివారం సదస్సు జరిగింది. భారతదేశ చరిత్రలో ఫాసిజం, హిం దూరాష్ట్ర స్థాపన దిశగా సంఘ్ ఫాసిజం, మేధో సృ.జన రంగాలపై ఫాసిస్టు దాడి.. ప్రతిఘటనా సాహిత్యోద్యమం, కార్పొరేట్ ఫాసిజం, ద్రవ్య పెట్టుబడి వైమానిక యుద్ధం అనే అంశాలపై పలువురు వక్తలు ప్రసంగించారు.

మా ర్కిస్ట్ మేధావి మురళీధరన్ (అజిత్) మాట్లాడుతూ సంఘ్ పరివార్ ప్రభావా న్ని తప్పించుకోలేని విధంగా అన్ని సామాజిక పార్శాలలో హిందూ భావజాలం వ్యాపించి ఉందన్నారు. దళితులు, ఆదివాసులు తదితర సమూహాలు కులం ప్రాతిపదికన ఏకమై హిందూత్వాన్ని ఎదుర్కోలేవన్నారు. శ్రామికవర్గ చై తన్యం ద్వారానే హిందూత్వాన్ని సమర్థవం తంగా ఎదుర్కో గలమని అన్నారు. సీనియర్ జర్నలిస్టు కల్లూరి భాస్కరం మాట్లాడుతూ ఈ దేశంలో వందేళ్ళకు ముందు నుంచే సంఘ్ పరివార్ వేళ్లూనుకుందని అన్నారు. ప్రస్తుతం అది విధ్వంసకర, అణిచివేత విధానాలు అమలు చేస్తోందన్నారు. దక్షిణ భారత్‌లో సంఘ్ పరివార్ అధికారం కోసం ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టిస్తున్నట్టు చెప్పారు. విరసం అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ, సిఎస్‌ఆర్ ప్రసాద్, శివరాత్రి సుధాకర్, పాణి సదస్సు లో అధ్యక్షత వహించగా, షాజహానా, కాత్యాయనీ విద్మహే, కె. శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, రివేర పాల్గొని ప్రసంగించారు. సదస్సు ప్రారంభానికి ముందు విరసం పతాకాన్ని అరసవిల్లి కృష్ణ ఆవిష్కరించగా, ఇటీవల అనారోగ్యంతో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ సోదరుల స్థూపాన్ని ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News